మహేష్ బాబు మళ్లీ అదే పాత్ర‌లోనా.. వ‌ర్కోట్ అవుతుందా..?

January 23, 2020 at 1:04 pm

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ కావ‌డంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుట్ జోష్‌లో ఉన్నాడు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించింది. సంక్రాంతి కాన‌క‌గా జ‌న‌వ‌రి 11న వ‌చ్చిన ఈ చిత్రం మంచి స‌క్సెస్ అందుకుంది. ఇక ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు తన తరువాత సినిమాని దర్శకుడు వంశీ పైడిపల్లితో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది. వచ్చే ఏడాది అక్టోబర్ లో దసరా సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

అయితే తాజాగా ఈ సినిమాలోని మహేష్ రోల్ కి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. మహేష్ ఈ సినిమాలో స్పై పాత్రలో నటించబోతున్నారట. అయితే మహేష్ బాబు ఇప్పటికే ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన స్పైడ‌ర్ సినిమాలో స్పై రోల్ లో న‌టించినా ఆ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మ‌ళ్లీ ఇప్పుడే అదే రోల్ ఎంచుకుంటే వ‌ర్కోట్ అవుతుందా అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇక‌ ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది.

కాగా, మ‌హేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు.. పక్కా మెసేజ్ తో, తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయాన్నే అందుకుంది. ఇక‌ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మ‌రో సారి వీరిద్ద‌రి కాంబోలో సినిమా రాబోతుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు వంశీ.

మహేష్ బాబు మళ్లీ అదే పాత్ర‌లోనా.. వ‌ర్కోట్ అవుతుందా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts