`సరిలేరు నీకెవ్వరు’ 2 వీక్స్ కలెక్షన్స్.. !

January 25, 2020 at 4:10 pm

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తుంది. దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్‌, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిచారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించింది. సంక్రాంతి పండగ కానుకగా జనవరి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుంది. గత కొన్ని చిత్రాలుగా ప్యాసివ్ రోల్స్ లోనే కనిపిస్తూ వచ్చిన మహేష్ బాబు పూర్తిగా యాక్టివ్ రోల్ చేసిన చిత్రం సరిలేరు నీకెవ్వరు.

ఆర్మీ మేజర్ గా మహేష్ నటించిన ఈ చిత్రంలో లేడి అమితాబ్ విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌లో పోషించారు. రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్ త‌దిత‌రులు నటించారు. అలాగే ఈ రోజు నుంచి మరికొన్ని సీన్స్ ని కూడా యాడ్ చేస్తున్నారు. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఫస్ట్ వీక్ లో ఆంధ్ర-తెలంగాణలో 84 కోట్ల షేర్ సాధించింది. సెకండ్ వీక్ పూర్తయ్యే సరికి ఈ చిత్రం ఆంధ్ర తెలంగాణాలో 106.6 కోట్ల షేర్ తో ఆల్ టైం టాప్ 4 లో కొనసాగుతోంది.

అలాగే వరల్డ్ వైడ్ కూడా 128 కోట్ల షేర్ తో అల్ టైం టాప్ 5 గా నిలిచింది. ఇప్పటి వరకు మహేష్ నటించిన సినిమాల గత రికార్డులను పూర్తిగా తుడిచిపెట్టేసింది ఈ చిత్రం. రెండు వారాల తర్వాత కూడా సరిలేరు నీకెవ్వరు మంచి వసూళ్లనే తీసుకొస్తుంది. ఈ నేప‌థ్యంలోనే ఆంధ్ర – తెలంగాణలో బాహుబలి 2(198.7 కోట్లు), బాహుబలి(110.1 కోట్లు), అల వైకుంఠపురములో (107.78 కోట్లు-12 రోజుల్లో), సరిలేరు నీకెవ్వరు(106 కోట్లు), సైరా నరసింహారెడ్డి(104.9 కోట్లు) సినిమాలు అల్ టైం టాప్ 5 లో కొనసాగుతున్నాయి.

‘సరిలేరు నీకెవ్వరు’ ఆంధ్ర – తెలంగాణ టు వీక్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:

నైజాం – 34.96 కోట్లు

సీడెడ్ – 14.79 కోట్లు

గుంటూరు – 9.3 కోట్లు

ఉత్తరాంధ్ర – 17.95 కోట్లు

తూర్పు గోదావరి – 10.59 కోట్లు

పశ్చిమ గోదావరి – 6.94 కోట్లు

కృష్ణా – 8.28 కోట్లు

నెల్లూరు – 3.86 కోట్లు
——————————————————–
14 రోజుల మొత్తం షేర్ – 106.67 కోట్లు
——————————————————–

కర్ణాటక – 7.6 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా – 2.05 కోట్లు

ఓవర్సీస్ – 11.70 కోట్లు
——————————————————-
వరల్డ్ వైడ్ 14 డేస్ షేర్ – 128.02 కోట్లు
——————————————————-

`సరిలేరు నీకెవ్వరు’ 2 వీక్స్ కలెక్షన్స్.. !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts