తెలుగు రాష్ట్రాల్లో మహేష్ హవా, ఆరో రోజు కూడా…!

January 17, 2020 at 2:30 pm

అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతుంది. వసూళ్ళ పరంగా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. సంక్రాంతి సీజన్ కావడంతో భారీ వసూళ్లు సాధించి మరోసారి మహేష్ ని వంద కోట్ల క్లబ్ లో చేర్చింది ఈ సినిమా. ఇప్పటి వరకు దాదాపుగా ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూలు చేసి 150 కోట్లకు దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే ఏపీ తెలంగాణా రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఏపీలో ఆరో రోజు వసూళ్లు ఒకసారి చూస్తే,

సీడెడ్‌లో రూ.3.14 కోట్లు

ఉత్తరాంధ్రలో రూ.1.75 కోట్లు

కృష్ణా జిల్లాలో రూ.72 లక్షలు

గుంటూరులో రూ.53 లక్షలు

తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.01 కోట్లు

పశ్చిమ గోదావరి జిల్లాలోరూ.52 లక్షలు

నెల్లూరులో రూ.31 లక్షలు వసూలు చేసింది.

6వ రోజున నైజాంలో ఈ చిత్రం రూ.3.14 కోట్లు వసూలు చేసింది. ఆరు రోజుల్లో ఈ చిత్రం రూ.25.49 కోట్లు కలెక్ట్ చేసింది. ఏపీ, తెలంగాణలో మొత్తం కలిపి 6 రోజున సరిలేరు నీకెవ్వరు చిత్రం రూ.8.5 కోట్లు చేసింది. ఆరో రోజు ప్రపంచ వ్యాప్తంగా పది కోట్లకు పైగా వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో మహేష్ హవా, ఆరో రోజు కూడా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts