మహేష్ సినిమా 16 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అంటే…!

January 28, 2020 at 6:02 pm

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై తెరకెక్కించారు. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి పండుగకు విడుదలై మంచి విజయం సాధించింది. భారీ వసూళ్లతో దూసుకుపోతుంది.

ప్రొఫెసర్‌ భారతీగా లేడీ అమితాబ్‌ విజయశాంతి పవర్‌ఫుల్‌ పాత్రలో ఈ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. వసూళ్ళ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది ఈ సినిమా. ఇప్పటి వరకు 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా సరికొత్త రికార్డులను ఈ చిత్రం తన ఖాతాలో నమోదు చేసుకుంటుంది. ఆర్మీ అధికారిగా మహేష్ నటన ఈ సినిమాలో విశేషంగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా 16 రోజులకు గానూ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 113.04 కోట్ల షేర్ రాబట్టినట్లుగా చిత్రయూనిట్ అఫీషియల్‌గా ఒరిజినల్ కలెక్షన్స్ అంటూ ప్రకటించింది. వారు విడుదల చేసిన కలెక్షన్స్ కోట్లు (షేర్)
నైజాం: 38.20
సీడేడ్: 15.66
ఉత్తరాంధ్ర: 19.25
తూర్పు గోదావరి: 10.86
పశ్చిమ గోదావరి: 7.10
గుంటూరు: 9.50
కృష్ణా: 8.52
నెల్లూరు: 3.95
టోటల్ ఏపీ, తెలంగాణ షేర్: 113.04 కోట్లు

మహేష్ సినిమా 16 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అంటే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts