మ‌హేష్ మ‌రో మ‌ల్టీప్లెక్స్… ఎక్క‌డంటే..?

January 25, 2020 at 6:10 pm

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు టాప్ హీరోనే కాదు. మంచి తెలివైన బిజినెస్ మ్యాన్ కూడా. ఓ ప‌క్క సినిమాల్లో టాప్ హీరోగా న‌టిస్తూనే మ‌రో ప‌క్క ఏ ప‌నైనా స‌రే ప‌క్కా బిజినెస్ మైండ్ తో ఆలోచిస్తున్నాడు మ‌హేష్‌. ఇప్ప‌టికే ఆల్రెడీ ప‌లు వాణిజ్య ప్ర‌క‌న‌ల్లో న‌టిస్తూ మ‌రోప‌క్క హైద‌రాబాద్‌లోని ఎఎంబి సినిమాస్ పెద్ద మాల్‌ని కూడా క‌ట్టాడు. ఇది కొండాపూర్‌లో అతి పెద్ద మ‌ల్టీప్లెక్స్ అని చెప్పాలి.

ఆల్రెడీ ఆ మ‌ల్టీప్లెక్స్ ఓపెన్ అయి సంవ‌త్స‌రం దాట‌గా ఇప్పుడు ఆయ‌న ఏషియ‌న్ సినిమాస్ స‌హ‌కారంతో మ‌హేష్ మ‌రో మ‌ల్టీప్లెక్స్‌ను ప్రారంభించ‌నున్నారు. బెంగుళూర్‌న‌గ‌రం న‌డిబొడ్డున ఈ మ‌ల్టీప్లెక్స్‌కు ప్లాన్ చేస్తున్న‌ట్లు సమాచారం. ఇక క‌ర్న‌ట‌క‌లో కూడా మ‌న తెలుగువారి కోసం మ‌హేష్ మ‌రో కొత్త మ‌ల్టీప్లెక్స్‌ను నిర్మించ‌నున్నార‌ని ప్ర‌స్తుతం ఫిల్మ్ వ‌ర్గాల్లో ఈ హాట్ టాపిక్ న‌డుస్తుంది. కాక‌పోతే మ‌హేష్ దీనిపైన ఇంకా ఎటువంటి అధికార ప్ర‌క‌ట‌న ఇవ్వ‌లేదు.

అదే విధంగా హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలో కూడా మ‌రో మ‌ల్టీప్లెక్స్ కి ప్లాన్ చేస్తున్న‌ట్టు కూడా స‌మాచారం ఉంది. ఇక ఇవ‌న్నీ ఒక ఎత్తైతే ప్ర‌స్తుతం ఆయ‌న సినిమాల్లో న‌టించినందుకు రెమ్యూన‌రేష‌న్ తీసుకోవ‌డం లేదు. దానికి బ‌దులుగా ఆయ‌న కొన్ని ఏరియాల రైట్స్ తీసుకుంటూ సినిమా నిర్మాణంలో భాగంగా మారుతున్నారు. అంటే కొన్ని మూవీస్‌కి ఆయ‌న ప్రొడ్యూస‌ర్‌గా కూడా చేస్తున్నారు.

మ‌హేష్ మ‌రో మ‌ల్టీప్లెక్స్… ఎక్క‌డంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts