రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మంచు మ‌నోజ్‌

January 28, 2020 at 4:35 pm

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో, క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్‌బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ కొద్దీ రోజుల క్రితం తన భార్య ప్రణతికి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. విజ‌య‌వాడ‌కు చెందిన ప్ర‌ణతి మ‌నోజ్ వ‌దిన అయిన విష్ణు భార్య వెరోనికా ద్వారా మ‌నోజ్‌కు ప‌రిచ‌యం కావ‌డం.. వాళ్లిద్ద‌రు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే రెండేళ్ల‌కే ఈ దంప‌తుల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో చివ‌ర‌కు వీళ్లు విడిపోయారు.

భార్య నుంచి విడిపోయిన మ‌నోజ్ త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న బ‌రువైన బాధ‌ను అంద‌రితోనూ పంచుకున్నారు. ఇక ఒక్క‌డు మిగిలాడు త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉన్న మ‌నోజ్ ఇప్పుడు త‌న వ్య‌క్తిగ‌త బాధ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నాడు. ఇక ఇప్పుడు రెండో పెళ్లి కి సిద్దమయ్యాడనే వార్తలు వైరల్ గా మారాయి. దీనికి కారణం కూడా మనోజ్ పోస్ట్ చేసిన ట్వీటే నిద‌ర్శ‌న‌మంటున్నారు.

సోష‌ల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ సినిమాల పరంగా ..సామజిక అంశాల ఫై ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా తన ట్విట్టర్ లో.. ‘ఫైర్ బాల్‌గా వెలగడానికి అంతా సెట్ అయ్యిందని.. ఈ వీక్‌లో తన నుండి ఆసక్తికరమైన అనౌన్స్‌మెంట్ ఉండబోతుంది.. వేచి చూడండి’ అంటూ పోస్ట్ పెట్టారు. అయితే మంచు మనోజ్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మ‌నోజ్ చేసిన ఈ ట్వీట్ ఖచ్చితంగా రెండో పెళ్లి గురించే అని చాల మంది కామెంట్స్ పెడుతున్నారు. మరి నిజంగా దాని గురించేనా..లేక కొత్త సినిమా గురించా అనేది తెలియాలి. ఏదేమైనా మ‌నోజ్ మొత్తానికి మంచి జోష్‌తో ఉన్నాడ‌న్న‌ది మాత్రం తెలుస్తోంది.

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మంచు మ‌నోజ్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts