పామాయిల్ రైతులకు జ‌గ‌న్ ప్రామీస్ స‌క్సెస్‌… రైతుల ఖాతాల్లోకి బోన‌స్‌

January 28, 2020 at 11:22 am

త‌న ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లో ఏం విన్నారో.. ఏం చూశారో.. ప్ర‌జ‌లకు నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఇచ్చిన హామీని వైసీపీ అధినేత జ‌గ‌న్ తూ.చ. త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తున్నారు. మాట కోసం నిలబ డుతున్న నాయ‌కుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. ప్ర‌జాసంక‌ల్ప యాత్రలో ప్ర‌జ‌ల క‌ష్టాలు, వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్న జ‌గ‌న్.. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చాక‌.. ఆయ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపైనే ఎక్కువ‌గా దృష్టి పెడుతున్నారు. పాల‌కులు కాదు.. మేము సేవ‌కులం! అంటూ జ‌గ‌న్ చేసిన నినాదం నిజంగానే ఆచ‌రణ‌లోనూ క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

గ‌త పాల‌కుల దాష్టీకానికి బ‌లై.. త‌మ గోడు వినేవారు కూడా లేక అల్లాడిన ప్ర‌జ‌ల‌కు ఆశారేఖ‌లా ప్ర‌జాసంక ల్ప యాత్ర‌లో క‌నిపించిన జ‌గ‌న్‌కు అంద‌రిలాగానే ఆయిల్ పామ్ రైతులు కూడా త‌మ గోడును వెళ్ల‌దీసు కున్నారు. ప్ర‌పంచంలో మ‌లేషియా త‌ర్వాత మ‌న ద‌గ్గ‌రే (గోదావ‌రి, కృష్ణా జిల్లాల్లో ఏలూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో) ఈ పంట ఎక్కువ‌గా పండుతుంది. అయినా త‌మ జీవితాలు మాత్రం పండ‌డం లేద‌ని, త‌మ క‌ష్టానికి క‌నీస మ‌ద్ద‌తు కూడా ల‌భించ‌డం లేద‌ని ఆయిల్ పామ్ రైతులు త‌మ గోడును జ‌గ‌న్‌కు విన్న‌వించుకున్నారు. వీరి స‌మ‌స్య‌లు తెలుసుకున్న జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపిస్తాన‌ని హామీ ఇచ్చారు.

అన్న‌మాట ప్ర‌కారం, ఆయిల్ పామ్ రైతుల‌కు ఇచ్చిన హామీ ప్ర‌కారం జ‌గ‌న్‌.. ట‌న్ను మ‌ద్ద‌తు ధ‌ర‌ పెంచుతూ.. గ‌తంలోనే ఆదేశాలు జారీ చేశారు. అమ‌లు చేయించారు కూడా. ఇక‌, అంత‌టితో ఈ స‌మ‌స్య తీరిపోయింద‌ని జ‌గ‌న్ భావించ‌లేదు. ఆయ‌న ఈ రైతుల ప‌క్షాన నిలిచారు. తాజాగా వారికి బోన‌స్ ప్ర‌క‌టించారు. అద‌న‌పు ఓఈఆర్ కింద రూ.1.72శాతం పెంచుతూ.. ఈ మొత్తాన్ని ఆయిల్ పామ్ కంపెనీలు రైతుల ఖాతాల్లోకి నేరుగా జ‌మ‌చేయాల‌ని ఆదేశిస్తూ.. ప్ర‌భుత్వం తాజాగా ఉత్త‌ర్వులు జారీచేసింది. ఈ ఉత్త‌ర్వులు 2018-19 సంవ‌త్స‌రానికి వ‌ర్తిస్తాయ‌ని పేర్కొన్నారు.

ఇక‌, ఈ రైతుల‌కు జ‌రిగిన న్యాయం వెనుక ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీధ‌ర్ కృషి కూడా ఎంతో ఉండ‌డం గ‌మ‌నార్హం. రైతుల గ‌ళాన్ని సీఎం జ‌గ‌న్‌కు ఎప్ప‌టిక‌ప్పుడు వినిపిస్తూ.. వారికి న్యాయం జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో మొత్తం రూ.76 కోట్ల రూపాయ‌లు రైతుల ఖాతాల‌కు చేర‌నుంది. ఆయిల్ పామ్ చ‌రిత్ర‌లోనే ఇలాంటి సాయం అందించ‌డం తొలిసారి అని రైతులు సంబ‌రాలు చేసుకుంటుండ‌డం విశేషం. ఇక డిసెంబ‌ర్ నుంచి కూడా ఫామాయిల్ రేటు రు.11 వేల‌పైనే ఉంటుంద‌ని తెలుస్తోంది.

పామాయిల్ రైతులకు జ‌గ‌న్ ప్రామీస్ స‌క్సెస్‌… రైతుల ఖాతాల్లోకి బోన‌స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts