పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాధితులు ఇలా బతికిపోయారా..!

January 24, 2020 at 11:40 am

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అజ్ఞాతవాసిలాంటి కళాఖండం అవుతుందని ఎవరు ఊహిస్తారు. పవన్ ఎన్నికలకు ముందు చేసిన చివరి సినిమా కావడంతో ఈ సినిమాను కోట్లు పోసి మరీ కొన్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే భారీ రేట్లకు అజ్ఞాతవాసి అమ్ముడు అయ్యింది. అయితే సినిమా తొలి రోజు తొలి ఆటకే ఘోరమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. కొన్నవాళ్లు అందరూ నిండా మునిగిపోయారు. పవన్, త్రివిక్రమ్ కలిసి మెయిన్ బయ్యర్లకి ఇరవై కోట్లు తిరిగి ఇచ్చారు. అయినా కానీ ఆ నష్టాలయితే పూర్తిగా గట్టెక్కలేదు.

అయితే అప్పట్లో త్రివిక్రమ్ -తమ కాంబినేషన్లో వచ్చే సినిమా రైట్స్‌ను మీకే అమ్ముతామంటూ చినబాబు వాళ్లకు హామీ ఇచ్చారట. అయితే వాళ్లనే నమ్ముకుని ఉన్న బయ్యర్లు ఎట్టకేలకు రెండేళ్లకు జాక్‌పాట్ కొట్టారు. అల వైకుంఠపురములో చిత్రానికి ఇద్దరు నిర్మాతలున్నా కానీ బిజినెస్ అంతా హారిక హాసిని క్రియేషన్స్ మీదే జరిగింది. రెండు, మూడు ఏరియాలో వదిలేస్తే మిగిలిన అన్ని ఏరియాలు అజ్ఞాతవాసి సినిమాను కొన్న బయ్యర్లకే ఇచ్చారు.

ఈ సినిమా ఇప్పుడు లాభాల పంట పండిస్తోంది. చాలా ఏరియాల్లో రూపాయికి రెండు రూపాయల లాభం కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే బయ్యర్లు భారీ లాభాలు సొంతం చేసుకున్నారు.
ఏదేమైనా ఏ త్రివిక్రమ్‌ను నమ్ముకుని రెండేళ్ల క్రితం నిండా మునిగారో ఇప్పుడు వాళ్లంతా అదే త్రివిక్రమ్ సినిమాతో సంబరాలు చేసుకుంటున్నారు. త్రివిక్రమ్‌తోనే వరుసగా ఆరు సినిమాలు తీసిన హారిక హాసిని సంస్థ అతను తారక్‌తో తీయబోతున్న తదుపరి చిత్రాన్ని కూడా నిర్మించనుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాధితులు ఇలా బతికిపోయారా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts