బాల‌య్య‌ను ఫాలో అవుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌….?

January 25, 2020 at 11:24 am

ప్ర‌స్తుతం బాల‌య్య‌ను ఫాలో అవుతున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అవును! మీరు విన్న‌ది నిజ‌మే. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మేకప్‌ వేసుకుని చాలా కాలం అయ్యింది. అజ్ఞాత‌వాసి సినిమా త‌ర్వాత పూర్తి రాజ‌కీయాల‌తో బిజీ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఒక వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే ఆయన కథానాయకుడిగా ‘పింక్’ రీమేక్ మొదలైంది. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

ఇదిలా ఉంటే పింక్ రీమేక్‌తో పాటు మరో రెండు సినిమాలు కూడా పవన్ ఓకే చేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో క్రిష్ దర్శకత్వంలో చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను ఈ చిత్రాన్ని జనవరి 27న ప్రారంభించనున్నట్టు సమాచారం. పింక్ సినిమాతో పాటే ఈ సినిమాను కూడా ఒకేసారి పట్టాలెక్కించడానికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించబోతున్నాడు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయి.

ఈ సినిమాలో పవన్ ‘దొంగ’ పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. పవన్ సరసన కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్రగ్యా జైస్వాల్ అంతగా ఫామ్‌లో లేర‌నే చెప్పాలి. బాలయ్య కూడా తన సినిమాల్లో కూడా అంతగా ఫామ్‌లోని హీరోయిన్స్‌నే ఎక్కువగా తీసుకుంటాడు. రీసెంట్‌గా ‘రూలర్’లో ఎపుడో ఫేడౌట్ అయిన వేదికను హీరోయిన్‌గా తీసుకున్నాడు. అదే రూట్లో పవన్ కళ్యాణ్.. తాజాగా ప్రగ్యాకు తన సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. అటు చూస్తే బాల‌య్య రూల‌ర్ చిత్రం ఫ‌ట్ అయింది.. మ‌రి ప‌వ‌న్ వ‌ర్కోట్ అవుతుందో.. లేదో.. చూడాలి.

బాల‌య్య‌ను ఫాలో అవుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌….?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts