రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత: పవన్

January 10, 2020 at 5:42 pm

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపుపై జనసేన అధ్యక్షుడు, హీరో పవన్ మరోసారి కీలక వ్యాక్యలు చేశారు. ఇప్పటికే రైతుల ఆందోళనలు, ప్రతిపక్షనేత పర్యటనలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉద్రిక్తత నెలకొన్న వేళ పవన్ కల్యాణ్ మరోసారి తన మార్కు డిమాండ్లతో ముందుచొచ్చారు. పాత్రికేయులతో శుక్రవారం నిర్వహించిన ఇష్టాగోష్టిలో పలు విషయాలను ఆయన వెల్లడించారు. ఏపీ రాజధాని విషయం విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం బాధ్యతని ఆయన ఉటంకించారు. అందులో భాగంగా కేంద్రం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి రాజధాని విషయంపై స్పష్టత నివ్వాలని కోరారు. రాజధాని తరలింపుపై బీజేపీ, కాంగ్రెస్ తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. వైసిపి ప్రభుత్వం కూడా రాజధాని ఏర్పాటుకు భూములిచ్చిన రైతులతో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకోవాలని, అప్పుడు ఎలాంటి వివాదం ఉండబోదని ఆయన సూచించడం విశేషం. మరి పవన్కల్యాణ్ వ్యాక్యలపై ఆయా పార్టీలు ఎలా స్పందిస్తాయో.

రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత: పవన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts