ఆ రోల్స్‌కూ రెడీ అంటున్న మాస్ మహారాజా…

January 17, 2020 at 3:28 pm

గత కొంతకాలంగా సరైన హిట్ లేక కాస్త డీలాపడిన మాస్ మహారాజ్ రవితేజ.. ఆ జ్ఞాపకాలన్నీ చెరిపేసేలా రంగంలోకి దిగుతున్నాడు. సరిగ్గా పదేళ్ల క్రితం `కిక్` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చారు రవితేజ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తరవాత మళ్లీ అంతటి హిట్‌ను అందుకోలేదు. ఎలాగైనా బ్లాక్‌బస్టర్ సాధించాలనే కసితో దూసుకొస్తున్నాడు. ఈ నేప‌థ్యంలోనే ర‌వితేజ హీరోగా, వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ సినిమా తెర‌కెక్క‌బోతుంది. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ ఈ చిత్రంలో మాస్ రాజాతో జోడీ కడుతుండగా.. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సంధర్భంగా చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ లో పాల్గొంటున్నారు. రవితేజ, దర్శకుడు వి ఐ ఆనంద్, నటుడు బాబీ సింహ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శకుడు వి ఐ ఆనంద్ రవితేజను ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఏ జోనర్ చిత్రాలలో నటించడానికి ఇష్టపడతారు అని అడుగగా , గతంలో నేను కమర్షియల్ సినిమాలు చేయడానికి ఇష్టపడే వాడిని, అందుకే కిక్, విక్రమార్కుడు వంటి చిత్రాలలో నటించి, సూపర్ హిట్స్ అందుకున్నాను. ఇక అదే సమయంలో నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించాను. ఆ చిత్రాలు నాకు ఎంతో ఇష్టం కానీ, అవి ఆడలేదు.

అయితే సినిమాలో కొత్తదనం, కొత్త కాన్సెప్ట్ లేకపోతే ప్రేక్ష‌కులు చూడ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు. సో.. పాత్ర భిన్నంగా ఉంటే విలన్ పాత్రలు చేయడానికైనా నేను రెడీ అని ర‌వితేజ క్లారిటీ ఇచ్చాడు. కాగా, నేల‌టికెట్టు నిర్మాత రామ్ త‌ల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇటీవ‌ల విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్లు, లుక్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. మ‌రి ఈ సినిమా అయినా ర‌వితేజాకు హిట్ ఇస్తుందో.. లేదో.. చూడాలి.

ఆ రోల్స్‌కూ రెడీ అంటున్న మాస్ మహారాజా…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts