‘ఆర్ఆర్ఆర్’ నుండి మరొక భారీ లీక్ : షాక్ లో మూవీ టీమ్….!!

January 24, 2020 at 5:45 pm

టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరక్కిస్తున్న తాజా హిస్టారికల్ భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ పై రోజురోజుకు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడుతున్న విషయం తెలిసిందే. తొలిసారిగా మెగా, నందమూరి ఫ్యామిలీ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు. ఇక ఇటీవల చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో విలన్స్ గా నటిస్తున్న స్కాట్, లేడీ స్కాట్ ల పోస్టర్స్ రిలీజ్ చేసిన యూనిట్, అతి త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు టాక్.

ఇకపోతే కొద్దిరోజుల క్రితం ఈ సినిమా నుండి హీరో ఎన్టీఆర్ కు సంబందించిన ఒక చిన్న వీడియో బైట్ లీక్ అయి పలు మీడియా మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అయింది. దానితో ఒక్కసారిగా తన సినిమా యూనిట్ కు మరింత కఠిన సూచనలు చేసిన జక్కన్న, ఇకపై సెట్ లోకి సెల్ ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసురావడం నిషేదించారట. అయినప్పటికీ కూడా షాకింగ్ గా నేడు ఈ సినిమా నుండి మరొక కీలక వీడియో లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి జరిగిన బల్గెరియా షెడ్యూల్ లో భాగంగా ఎన్టీఆర్ పై చిత్రీకరించిన ఒక సీన్ తాలూకు వీడియో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ తరహా లీక్స్ కు అడ్డుకట్ట వేయలేకపోతోందని, ఇక కాసేపటి క్రితం లీక్ అయిన వీడియో ఇప్పటికే ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్పుడే ఎంతో వైరల్ అయిందని సమాచారం. దీనితో ఒక్కసారిగా ఆర్ఆర్ఆర్ యూనిట్ మొత్తం తీవ్ర షాక్ లో ఉందని అంటున్నారు.

కాగా ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి, వేలాది మంది ఎంతో కష్టపడి తెరకెక్కించే సినిమాను ఈ విధంగా కొందరు తప్పుడు దారుల్లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం అంటే సినిమాని నిజంగా చంపడమే, కావున దయచేసి అటువంటి వీడియోలు మీ దగ్గర ఉంటె వెంటనే వాటిని డిలీట్ చేయడంతో పాటు, ఇకపై ఈ విధంగా ఎవరూ కూడా లీక్స్ కు పాల్పడవద్దని మా TJ సంస్థ తరపున అభ్యర్ధిస్తున్నాము……!!

‘ఆర్ఆర్ఆర్’ నుండి మరొక భారీ లీక్ : షాక్ లో మూవీ టీమ్….!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts