`సరిలేరు నీకెవ్వరు` 2 డేస్ క‌లెక్ష‌న్స్‌.. దద్దరిల్లిపోతున్న థియేట‌ర్లు..

January 13, 2020 at 1:18 pm

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ తెర‌కెక్కిన తాజాగా `స‌రిలేరు నీకెవ్వ‌రు`. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాను దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్‌, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిచారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. భరత్ అనే నేను, మహర్షి తర్వాత మహే‌ష్ బాబు ఈ సినిమాతో హ్యాట్రిక్ విజ‌యాన్ని అందుకున్నాడు.

ఈ సినిమాలో ముఖ్యంగా అనిల్ తన బలమైన కామెడీని మిస్ చేయకుండా అప్పుడప్పుడూయాక్షన్ సీన్స్‌తో కావాల్సినప్పుడల్లా తగినమోతాదులో సెంటిమెంట్ డ్రామాతో సినిమాను ఎంగెేజింగ్‌గా తీశాడు. దీంతో అసలే సినిమాలు లేక సరైన ఎంటర్‌టైనర్ కోసం చూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా తెగనచ్చేసిందని చెప్పోచ్చు. ప్ర‌స్తుతం ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తూ థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో కలెక్షన్స్ అదిరిపోతున్నాయి.

అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ముందు నుంచీ అందరూ ఊహిస్తూనే ఉన్నారు కానీ ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా వసూళ్లు రాబడతాయని ఎవ్వరూ ఊహించలేదు. సరిలేరు నీకెవ్వరు సినిమా మొదటి రోజు 32.64 కోట్ల షేర్ మార్క్ తో అల్ టైం నాల్గవ స్థానంలో నిలిచింది. రెండవరోజు మరో బిగ్ రిలీజ్ వల్ల కొంత డ్రాప్స్ ఉన్నప్పటికీ.. 9.5 కోట్ల షేర్ సాధించింది. రెండు రోజుల్లో 42 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి సూపర్బ్ సెకండ్ డే కలెక్షన్స్ అనిపించింది.

‘సరిలేరు నీకెవ్వరు’ ఆంధ్ర – తెలంగాణ 2 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:

నైజాం – 12.70 కోట్లు

సీడెడ్ – 5.44 కోట్లు

గుంటూరు – 5.7 కోట్లు

ఉత్తరాంధ్ర – 5.56 కోట్లు

తూర్పు గోదావరి – 4.04 కోట్లు

పశ్చిమ గోదావరి – 3.18 కోట్లు

కృష్ణా – 3.90 కోట్లు

నెల్లూరు – 1.58 కోట్లు
——————————————————–
రెండు రోజుల మొత్తం షేర్ – 42.1 కోట్లు
——————————————————–

`సరిలేరు నీకెవ్వరు` 2 డేస్ క‌లెక్ష‌న్స్‌.. దద్దరిల్లిపోతున్న థియేట‌ర్లు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts