దుమ్మురేపుతున్న మహేష్ బాబు, 6 డేస్ కలెక్షన్స్ !

January 17, 2020 at 1:36 pm

మహేష్ బాబు హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా వసూళ్ళ పరంగా దూసుకుపోతుంది. హిట్ టాక్ రావడంతో సంక్రాంతి సీజన్ లో ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా సరిలేరు నీకెవ్వరు నిలిచింది. క్లాస్ మాస్ ని విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా, రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది.

అటు విదేశాలలో కూడా ఈ సినిమా క్రేజ్ కొనసాగుతుంది. మహేష్ బాబు ఫాలోయింగ్ సినిమాకు ప్లస్ అయింది. నైజాంలో ఆంధ్రాలో ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. మూడు రోజుల్లోనే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం విడుదలై ఆరు రోజులు అయినా సరే తన దూకుడు కొనసాగిస్తుంది. ఆరో రోజు సరిలేరు నీకెవ్వరు సినిమా ఆరు కోట్లకు పైగా వసూలు చేసింది.

అల్లు అర్జున్, రజని, కళ్యాణ్ రామ్ సినిమాలు ఉన్నా సరే మహేష్ క్రేజ్ ముందు నిలవలేకపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో మొత్తం కలిపి 6 రోజున సరిలేరు నీకెవ్వరు చిత్రం రూ.8.5 కోట్లకు పైగా వసూలు చేసిందని టాలివుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా వసూళ్లు 150 కోట్లకు పైగా వెళ్ళే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. అటు ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లు సాధిస్తుంది.

దుమ్మురేపుతున్న మహేష్ బాబు, 6 డేస్ కలెక్షన్స్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts