స‌రిలేరుకు తొలి రోజు క‌లెక్ష‌న్ల‌తోనే షాక్ ఇచ్చి బన్నీ…. !

January 13, 2020 at 2:42 pm

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 11న రిలీజైతే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురములో సినిమా జనవరి 12న రిలీజయింది. రెండు పెద్ద సినిమాలు సంక్రాంతి బ‌రిలో ఉండ‌డంతో ఈ రెండు సినిమాల్లో ఏది బాగా ఆడుతుంద‌న్న ఉత్కంఠ అంద‌రిలోనూ ఉంది. ఇక రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. రిజ‌ల్ట్ వ‌చ్చేసింది.

మ‌హేష్ స‌రిలేరు ప‌క్కా మాస్ ఎంట‌ర్టైన్‌గా ఉంటే. బ‌న్నీ అల వైకుంఠ‌పుర‌ములో క్లాస్‌, మాస్ తేడా లేకుండా మెప్పిస్తోంది. ఇక స‌రిలేరు తొలి రోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రు. 46.77 కోట్ల షేర్, ఆంధ్ర, తెలంగాణాలో కలిపి రు. 32.7 కోట్ల షేర్ సాధించింది. ఇక కృష్ణా జిల్లాలో స‌రిలేరు మెగాస్టార్ సైరా సినిమా రికార్డును కూడా క్రాస్ చేసింది. సైరా నరసింహా రెడ్డి 3.02 కోట్లు కలెక్ట్ చేయడం. ఆ రికార్డ్ ని సరిలేరు నీకెవ్వరు సినిమా 3.07 కోట్ల షేర్ తో బద్దలు కొట్టింది.

అయితే మ‌హేష్‌కు ఈ ఆనందం ఒక్క రోజు కూడా లేకుండా పోయింది. ఆ మ‌రుస‌టి రోజే వ‌చ్చిన బ‌న్నీ అల వైకుంఠ‌పుర‌ములో మ‌హేష్ రికార్డు బ్రేక్ చేసి ప‌డేసింది. అల వైకుంఠపురములో కృష్ణాలో మొదటి రోజు రు. 3.11 కోట్ల షేర్‌తో ఆల్ టైం టాప్ రికార్డ్ సాధించింది. కృష్ణా జిల్లాలో హ‌య్య‌స్ట్ ఫ‌స్ట్ డే షేర్స్ సాధించిన టాప్ -5 సినిమాల లిస్ట్ ఇలా ఉంది

1. ‘అల వైకుంఠపురములో’ – 3.11 కోట్లు
2. ‘సరిలేరు నీకెవ్వరు – 3.07 కోట్లు
3. సైరా నరసింహారెడ్డి – 3.02 కోట్లు
4. బాహుబలి 2 – 2.85 కోట్లు
5. సాహో – 2.52 కోట్లు

స‌రిలేరుకు తొలి రోజు క‌లెక్ష‌న్ల‌తోనే షాక్ ఇచ్చి బన్నీ…. !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts