‘ స‌రిలేరు నీకెవ్వ‌రు ‘ ప‌బ్లిక్ టాక్‌… బొమ్మ హిట్టా… ఫ‌ట్టా..!

January 11, 2020 at 11:48 am

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్‌ రాజు సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై నిర్మించబడిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ సంక్రాంతి కానుకగా ఈరోజు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు మ‌హేష్‌బాబుపై ప్ర‌త్యేక‌మైన ప్రేమ చూపించి ఆరు షోల‌కు అనుమ‌తులు ఇచ్చారు.

దీంతో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి నుంచే థియేట‌ర్ల వ‌ద్ద ప్రేక్ష‌కులు పోటెత్తారు. దీంతో రాత్రి నుంచే స‌రిలేరు ప‌బ్లిక్ టాక్ బాగా వైర‌ల్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ అంతా కాశ్మీర్ తో పాటు అద్భుతమైన కామెడీ సన్నివేశాలతో ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించాడు ద‌ర్శ‌కుడు అనిల్. మేజ‌ర్ అజ‌య్‌కృష్ణ రోల్‌లో మ‌హేష్ న‌ట‌న సూప‌ర్బ్ అనిపించేలా ఉంది. ఇక ట్రైన్ ఎపిసోడ్‌లో కామెడీ కూడా సాగ‌దీసినా బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. ఇక్క‌డే ప్రేక్ష‌కులు కామెడీకి బాగా క‌నెక్ట్ అవుతారు.

ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరో సినిమాకు ఉండని స్థాయిలో పెట్టి ఆకట్టుకున్నారని చెపుతున్నారు. సెకండ్ హాఫ్ మొత్తం కూడా ప్రకాష్ రాజ్ – విజయశాంతి – మహేష్ చుట్టూ తిప్పేశాడు. విల‌న్ ప్ర‌కాష్‌రాజ్ పాత్ర‌ను స‌రిగా డిజైన్ చేయ‌క‌పోవ‌డం.. విలనిజం తేలిపోవ‌డం.. అటు విజ‌య‌శాంతిని 13 ఏళ్ల త‌ర్వాత తిరిగి న‌టింప‌జేసినా ఆమె పాత్ర‌కు ప్రాధాన్యం లేక‌పోవ‌డం… ఇటు హీరోయిన్ ర‌ష్మిక‌తో మ‌హేష్ కెమిస్ట్రీ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం లాంటి కామెంట్లు ప్రేక్ష‌కుల నుంచి వ‌స్తున్నాయి.

ఏదేమైనా స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాపై మ‌హేష్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు. మా వాడికి మ‌ళ్లీ హ్యాట్రిక్ బొమ్మ ప‌డింద‌ని చెపుతున్నారు. కామ‌న్ ఆడియెన్స్ కూడా కామెడీకి బాగానే క‌నెక్ట్ అయ్యారు. ఇక విమ‌ర్శ‌కుల‌కు సినిమా పెద్ద‌గా న‌చ్చ‌క‌పోయినా సంక్రాంతికి బొమ్మ హిట్టే అంటున్నారు.

‘ స‌రిలేరు నీకెవ్వ‌రు ‘ ప‌బ్లిక్ టాక్‌… బొమ్మ హిట్టా… ఫ‌ట్టా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts