ఒక్క క్లిక్ చేస్తే చాలు కైపెక్కించే అమ్మాయిలు… ఎట్రాక్ట్ చేసే ఆంటీలు

January 10, 2020 at 5:33 pm

ఇప్పుడున్న‌ది అంతా ఆన్‌లైన్ ప్ర‌పంచం… ఈ ఆన్‌లైన్ మాయ‌లో ప‌డిపోతోన్న జ‌నాలు స‌ర్వం స‌మ‌ర్పించేసుకుంటున్నారు… అంతా అయిపోయాక ల‌బోదిబో మంటున్నారు. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోతోంది. ఊరూ పేరు, ముఖ్కూ మొఖం తెలియ‌ని అంద‌మైన అమ్మాయిలు, ఆంటీల‌తో వీడియో కాల్స్ మాట్లాడ‌డం ఇటీవ‌ల కామ‌న్ అయిపోయింది. వాళ్ల హాట్ లుక్స్‌, కైపెక్కించే మ‌త్తైన మాట‌లు.. అంత‌కు మించి విదేశీ అమ్మాయిల‌మంటూ ఆక‌ర్షిస్తుండ‌డంతో కుర్రాళ్లు, అబ్బాయిలు ఒళ్లు తెలియ‌కుండా… త‌మ‌ను తామే మైమ‌ర‌చిపోయి ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

ఇలాంటి పిచ్చి మాయ‌లో ప‌డిపోతే మ‌న ప‌ర్స‌న‌ల్ డేటా అంతా హ్యాక‌ర్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఒకే ఒక్క వీడియో కాల్‌తో మ‌న బ్యాంకుల్లో ఉన్న డ‌బ్బంతా అక్కౌంట్ల నుంచి మాయం అయ్యి హ్యాక‌ర్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇప్పుడంతా వాట్సప్‌ కాల్స్‌, వీడియో కాల్స్‌, లైవ్ చాట్‌ల యుగ‌మే న‌డుస్తోంది. ఇందుకోసం రోజుకో కొత్త యాప్ పుట్టుకువ‌స్తోంది. ఈ యాప్‌ల ప్ర‌భావంతో అటు వైపు ముఖ్కూ మొఖం తెలియ‌ని వారితో కూడా మ‌నం మాట్లాడేస్తున్నాం. సోష‌ల్ మీడియా గ్రూపుల ప్ర‌భావంతో మ‌న నెంబ‌ర్లు అటు వైపు వారికి కూడా సులువుగా తెలిసిపోతున్నాయి

లివ్‌యూ, బిగో లైవ్‌, క్వాయ్‌, అప్‌లైవ్‌, లైవ్‌ టాక్‌, మ్యాచ్‌ అండ్‌ టాక్‌, హాట్‌ లైవ్‌…. ఇలాంటివి బోలెడున్నాయి. ఇక గ‌ర్ల్‌ఫ్రెండ్స్ కావాలంటూ అంటూ యాడ్స్ పెట్టి మ‌రీ అబ్బాయిల‌ను ఆక‌ర్షిస్తున్నారు. ఏదేదో ఆక‌ర్ష‌ణ‌ల‌కు లోన‌య్యి ఇలాంటి యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకునే క్ర‌మంలో ఫేస్‌బుక్‌ లేదా జీమెయిల్‌తో యాప్‌లోకి ఎంటరవుతున్నారు. అలా కొంత‌సేపు చాట్ త‌ర్వాత కాయిన్స్ అయిపోయాయ‌ని.. మ‌ళ్లీ మీరు కాయిన్స్ కొనుక్కోవాల‌ని చెపుతున్నారు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్స్‌, పేటీఎం.. ద్వారా కాయిన్స్‌ కొనాలని మరో మెసెజ్‌ డిస్‌ప్లే అవుతుంది.

ఇక్క‌డ నుంచే అస‌లు మోసం స్టార్ట్ అవుతుంది. ఈ యాప్‌లో ఎంటర్‌ చేసే ప్రతీ సమాచారం థర్డ్‌ పార్టీ చేతిలోకి వెళ్తుంది. మన మొబైల్‌ నెంబర్‌తో అనుసంధానించి ఉన్న బ్యాంక్‌ అకౌంట్‌ డిటెయిల్స్‌, పేటీఎం, చివరికి ఫేస్‌బుక్‌ ట్విట్టర్‌ అకౌంట్లు సైతం హ్యాక్‌ అవుతున్నాయి. ఇంకేముంది, టెక్నాలజీ సాయంతో బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బంతా కాజేస్తున్నారు. ఇలా డ‌బ్బులు పోగొట్టుకున్న వారు త‌మ బాధంతా ఎవ్వ‌రికి చెప్పుకోలేక‌పోతున్నారు. చివ‌ర‌కు పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేసే సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు. త‌స్మాత్ ఇక‌పై అయినా మీరు జాగ్ర‌త్త‌గా ఉండండి.

ఒక్క క్లిక్ చేస్తే చాలు కైపెక్కించే అమ్మాయిలు… ఎట్రాక్ట్ చేసే ఆంటీలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts