ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీపై వేటు ?

January 12, 2020 at 6:57 pm

సినీ హాస్య నటుడు , మరియు వైసీపీ అధికార ప్రతినిధి ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీపై టీటీడీ బోర్డు చర్యలకు దిగింది. ఎస్వీబీసీ ఛానల్ ఉద్యోగినితో పృధ్వీ ఫోన్ సంభాషణను టీటీడీ మరియు వైసీపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.నిన్నటినుండి సోషల్ మీడియాలో జరుగుతున్న విస్తృత ప్రచారంతో పృథ్వీపై వేటు వేసేందుకు టీటీడీ సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పృధ్వీ రాజీనామా చేయాలని టీటీడీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు రాజధాని రైతులపై పైడ్ ఆర్టిస్టులు అంటూ దారుణ వ్యాఖ్యల తర్వాత.. పృథ్వీని దేవుడే శిక్షించాడంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో వైసీపీలో ప్రభుత్వంలో కూడా కలకలం మొదలైంది. పృధ్వీ వల్ల రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతోందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీపై వేటు ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts