త‌మ్మినేని మీ హోదా మ‌ర్చి… ఈ రాజ‌కీయాలేంటో…!

January 10, 2020 at 2:12 pm

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం వైఖ‌రిపై ప్ర‌జాస్వామ్య వాదులు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నా రు. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉన్న ఆయ‌న రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డంపై ఒకింత మౌనంగానే నిర స‌న వ్య‌క్తం చేస్తున్నారు. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న త‌మ్మినేనికి సీఎం జ‌గ‌న్ అత్యంత కీల‌క‌మైన స్పీక‌ర్ ప‌ద‌విని అప్ప‌గించారు. ఈ ప‌రిణామాన్నిఅంద‌రూ స్వాగ‌తించారు. నిజానికి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి వంటి ఉద్ధండులు కూడా ఈ ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నించార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే, బీసీ వ‌ర్గంతోపాటు గ‌తంలో మంత్రిగాను, వివిధ హోదాల్లోనూ ప‌నిచేసిన అనుభవం ఉన్న త‌మ్మినేనికి అప్ప‌గించారు జ‌గ‌న్‌.

ఇక‌, రాజ్యాంగ బ‌ద్ధ‌మైన స్పీక‌ర్ ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తులకు స‌హ‌న‌మే భూష‌ణం. గ‌తంలో అయ్య‌దేవ‌ర కాళేశ్వ‌ర‌రావు వంటివారు ఈ ప‌ద‌వుల‌కు వ‌న్నె తెచ్చారు. అలాంటి పంర‌ప‌ర రానురాను క్షీణిస్తోంది. ఈ నేప‌థ్యంలో త‌మ్మినేని వంటి సీనియ‌ర్ స్పీక‌ర్ ప‌దవికి వ‌న్నె తెస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. వాస్త‌వానికి ఆయ‌న త‌న ప్ర‌మాణం రోజు కూడా ఇదే చెప్పారు. కానీ, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేస్తుండ‌డం స్పీక‌ర్ ప‌ద‌విని విమ‌ర్శ‌ల చ‌ట్రంలోకి నెడుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం రాజ‌ధాని విష‌యం తీవ్ర వివాదానికి కార‌ణ‌మైంది. ఈ విష‌యంలో విప‌క్షాలు స‌హా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్లు ఇచ్చేందుకు వైసీపీలో చాలా మంది ఫైర్ బ్రాండ్లు ఉన్నారు. అయినా కూడా త‌మ్మినేని ఎక్క‌డ అవ‌కాశం వ‌స్తే అక్క‌డ ప్ర‌తిప‌క్షాలు స‌హా చంద్ర‌బాబుపై విరుచుకుప‌డుతున్నారు.

“అదొక పార్టీ(టీడీపీ) ఆయ‌నో ప్ర‌తిప‌క్ష నేత‌“- అంటూ రెండు వారాల కిందతీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌, ఇప్పుడు విశాఖ‌లో రాజ‌ధానిని మీరు ఆహ్వానిస్తారా? వ‌్య‌తిరేకిస్తారా? చెప్పండి అంటూ స్పీక‌ర్ త‌మ్మినేని స‌వాల్ విసురుతున్నారు. అమ‌రావ‌తిలో జరుగుతున్నది సహజసిద్దమైన పోరాటం కాదని, అసలు సిసలు ప్రజా ఉద్యమం ఎలా ఉంటుందో తాము చేసి చూపిస్తామని అన్నారు. అమరావతిలో లాగా తమది పెయిడ్ ఆర్టిస్ట్ ఉద్యమం కాదని, విశాఖలో రాజధానిని ప్రతిపాదనను వ్యతిరేకిస్తే ఉద్యమం అంటే ఏంటో చూపిస్తామని స్పీకర్‌ తమ్మినేని పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి రాయ‌ల‌సీమ వ‌ర‌కు అస‌లు ఉద్య‌మం ఎలా ఉంటుందో ? తాము చూపిస్తామ‌ని కూడా అంటున్నారు.

అక్క‌డితో ఆగ‌ని ఆయ‌న రాజకీయం చేసుకుని బతికే మీదీ ఓ బతుకేనా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఓ ఉత్తరాంధ్ర పౌరుడిగా విశాఖలో రాజధాని ఏర్పాటుకు ఎంతవరకైనా పోరాడుతామని చెప్పారు. ఏదేమైనా త‌మ్మినేని స్పీక‌ర్ హోదాలో ఉండి ఇలా మాట్లాడ‌డాన్ని ప్ర‌జ‌స్వామ్య వాదులు జీర్ణించుకోలేని ప‌రిస్థితి. ఏదో ఒక‌సారో రెండుసార్లో అని కాకుండా వైసీపీ నేత‌గా మాట్లాడేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఇవ‌న్నీ నిజానికి రాజ‌కీయాల్లో నాయ‌కులుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న‌వారు చేయాల్సిన‌వి. కానీ, త‌మ్మినేని స్పీక‌ర్‌గా రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉండి ఇలా వ్యాఖ్యానించడం స‌రికాద‌ని అంటున్నారు ప్ర‌జాస్వామ్య వాదులు. అంత‌గా రాజ‌కీయాలే ఇష్ట‌మైతే.. స్పీక‌ర్ ప‌ద‌విని వ‌దులుకుంటే స‌రి! అంటున్నారు., మ‌రి త‌మ్మినేని ఏమంటారో చూడాలి.

త‌మ్మినేని మీ హోదా మ‌ర్చి… ఈ రాజ‌కీయాలేంటో…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts