తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు…

January 25, 2020 at 10:21 am

నేడు వెలువడుతున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు కొనసాగుతుంది. మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ లకు ఈ నెల 22న జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నేడు జరుగుతుంది. ఇక వరుసగా ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడుతుండగా, మొదట పరకాల, చెన్నూరు మున్సిపాలిటీల ఫలితం వెలువడ్డాయి.

ఇక ఆ ఫలితాల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. పరకాలలో ఉన్న 22 వార్డులు టీఆర్ఎస్ ఖాతాలో పడగా, చెన్నూరులో ఉన్న 18 వార్డుల్లో కారు జోరు కొనసాగింది.
అటు సిరిసిల్ల్, బొల్లారం, హుజూరాబాద్, జవహర్ నగర్ మున్సిపాలిటీలని కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక నర్సంపేట పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. మొత్తం 23 పోస్టల్ బ్యాలెట్లలో 16 చెల్లు బాటుకాగా 7 చెల్లు బాటు కాలేదు. ఈ 16లో కాంగ్రెస్‌కు 8,టీఆర్ఎస్‌కు 7, స్వతంత్ర అభ్యర్థికి 1 ఓటు చొప్పున పోలయ్యాయి. అలాగే సూర్యపేట మున్సిపాలిటీలో ఓ వార్డు ఫలితం తేలగా, అది టీఆర్ఎస్ ఖాతాలో పడింది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts