వసూళ్ళ కోసం అభిమానులను మోసం చేస్తున్న స్టార్ హీరోలు…!

January 28, 2020 at 12:35 pm

తెలుగు సినిమాకు ఎప్పుడు అయితే కమర్షియల్ హంగులు అద్దారో అప్పటినుంచి సినిమా కథలో నాణ్యత అనేది లేకుండా పోయింది అనే విమర్శలు ఎక్కువగా ఈ మధ్య వింటున్నాం. గతంలో సినిమా హిట్ అంటే కథ బాగుంటేనే హిట్ అయ్యేది. ఇప్పుడు కథ కాకుండా దర్శకుడు, హీరో, నిర్మాతలు ఆధారంగా సినిమా హిట్ అవుతుంది. స్టార్ హీరో, స్టార్ నిర్మాత, స్టార్ దర్శకుడు అయితే చాలు సినిమా హిట్ ట్రాక్ లోకి వెళ్లి పోయిపోయినట్టే.

వసూళ్లు భారీగా ఉండటంతో సినిమాకు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు నిర్మాతలు. దర్శకులు, హీరోలు సినిమా కోసం ఎక్కువగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. దాదాపు గత ఐదారేళ్లుగా సినిమా కథలో నాణ్యత లేకపోయినా సరే సినిమాలు హిట్ అవుతున్నాయి అంటే ఇదే రహస్యం. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే చిత్రం గా చెప్పుకునే బాహుబలి సినిమాలో కూడా కథ లేదు.

అలాంటి సినిమా కూడా హిట్ అయింది అంటే కేవలం ఆ సినిమా కోసం చేసిన ప్రచారమే ఇక ప్రభాస్ నటించిన సాహో సినిమా కథలో ఏమాత్రం బలం లేకపోయినా సరే విజయం సాధించింది వసూళ్ళ పరంగా అంటే సినిమాకు చేసిన ప్రచారమే. ఇక మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కథ ఏ మాత్రం లేకపోయినా, విజయశాంతి మహేష్ బాబుని అడ్డంపెట్టుకుని సినిమాను ముందుకు నడిపించారు.

సినిమాలో పట్టు లేక పోయినా వసూళ్ల కోసం అనవసర ప్రచారం చేస్తూ అభిమానులు మోసం చేస్తున్నారు. ఇక అభిమానులు కూడా కథ పెద్దగా చూడకుండా హీరో దర్శకుడి ఆధారంగా సినిమాకి వెళ్తున్నారు అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు టాలివుడ్ లో స్టార్ హీరోల సినిమాలు అన్నీ ఈ విధంగానే ఉంటున్నాయి అనేది వాస్తవం.

సినిమాకు సంబంధించి కొన్ని మంచి సీన్లను టీజర్ గా పెట్టి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ హడావుడి చేస్తున్నారు. దీనితో సినిమాకు ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. వాటి గురించి అనవసర వ్యాఖ్యలు చేయడం, కన్నీరు కార్చడం, వివాదాస్పద లేదా సంచలన వ్యాఖ్యలు చేయడం వంటివి చేస్తున్నారు. బడ్జెట్ విషయంలో అన్ని కోట్లు ఇన్ని కోట్లు అని ప్రచారం చేయడం దీనితో మీడియా దృష్టిని ఆకర్షించడం,

మీడియాలో కమర్షియల్ ప్రచారాలు చేయడం, సినిమాలో ఏదైనా వింత పెట్టడం,దాని గురించి చర్చలు జరిగే విధంగా చేయడం వంటివి జరుగుతున్నాయి. ఇక యుట్యూబ్ చానల్స్ ని కూడా దీనికి ఎక్కువగా వాడుకుని యువతను ఎక్కువగా టార్గెట్ చేసి సినిమాలు విడుదల చేస్తున్నారు. దీనితో కథలో ఏ మాత్రం బలం లేకపోయినా సరే సినిమాకు వచ్చిన హైప్ ఆధారంగా వసూళ్లు సాధిస్తున్నారు.

వసూళ్ళ కోసం అభిమానులను మోసం చేస్తున్న స్టార్ హీరోలు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts