టాలీవుడ్ కమెడియన్ ఆరోగ్యంపై తాజా ట్వీట్

January 24, 2020 at 6:14 pm

తెలుగు చలన చిత్ర నటుడు సునీల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆయన్ని కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏ.ఐ.జీ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇంతవరకు తెలిసిన విషయమే. అయితే, అస్వస్థతకు గురైన సునీల్.. ఆస్పత్రిలో చేరారనే వార్త హల్ చల్ చేశాయి. మరోవైపు ఈ వార్తతో సినీ వర్గాలు, అభిమానులు ఉలిక్కిపడ్డారు. అయితే దీనిపై స్పందించిన సునీల్.. నేను ఆరోగ్యం గానే ఉన్నా… సైనస్ మరియు ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రికి వచ్చానని.. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యానని క్లారిటీ ఇచ్చారు.

ఇక ప్రస్తుతం తనకు ఆరోగ్యం మెరుగుపడిందని ఆయన తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన సునీల్, “నా క్షేమాన్ని కోరుకునే మీలాంటి వారి ఆశీస్సులతో క్షేమంగా ఉన్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. నాపై చూపించిన ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు. మీరందరూ ‘డిస్కో రాజా’ చూసి ఆనందించండి” అని పేర్కొన్నారు. మొత్తానికి తనకేం కాలేదని.. అనవసరంగా లేనిపోనివి చెప్పి అభిమానులను కంగారు పెట్టొద్దని కోరాడు సునీల్.

కాగా, టాలీవుడ్లో కమెడియన్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సునీల్కు హీరోగా అవకాశాలు తగ్గడంతో మళ్లీ సినిమాల్లో కమెడియన్గా నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో నటించాడు. అలాగే తాజాగా రవి తేజ డిస్కో రాజా సినిమాలో కూడా సునీల్ నటించాడు. రవిజతే హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకుడు. ఈ చిత్రం ఈరోజు విడుదల అయింది.

టాలీవుడ్ కమెడియన్ ఆరోగ్యంపై తాజా ట్వీట్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts