తెలంగాణ మున్సిపాలిటీ ఫలితాల్లో టీఆర్ఎస్‌కు ఊహించని షాక్

January 25, 2020 at 10:44 am

తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఓ వైపు ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సత్తా చాటుతున్న ఉమ్మడి మహుబూబ్ నగర్ లోని కొల్లాపూర్ లో మాత్రం చతికలపడింది. ఆ పార్టీకి రెబల్స్ షాక్ ఇచ్చారు. 20 వార్డులు గల కొల్లాపూర్‌లో మెజారిటీ వార్డుల్లో రెబల్స్ సత్తా చాటారు. ఇక ఇక్కడ టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తనకు సంబంధించిన అనుచరులని ఫార్వర్డ్ బ్లాక్ తరుపున పోటీకి దించి టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. చివరికి టీఆర్ఎస్ పార్టీ ఛైర్మన్ అభ్యర్ధి ఆనందకుమార్ ఓటమి పాలయ్యారు. దీని బట్టి చూసుకుంటే ఇక్కడ రెబల్స్ ఏ మేర సత్తా చాటారో అర్ధం చేసుకోవచ్చు.

అటు కామారెడ్డి మున్సిపాలిటీలో కూడా టీఆర్ఎస్‌కు అనుకున్న ఫలితం రాలేదు. ఇక్కడ కాంగ్రెస్-ఇండిపెండెంట్స్ కలిపి 8 వార్డుల్లో విజయం సాధిస్తే…టీఆర్ఎస్ 4 వార్డుల్లో గెలిచింది. ఇక రాష్ట్రం మొత్తం మీద వస్తున్న ఫలితాలని ఒక్కసారి చెక్ చేసుకుంటే మొత్తం 120 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ 51, కాంగ్రెస్ 1, బీజేపీ 1 చోట సత్తా చాటగా, 9 కార్పొరేషన్‌ల్లో టీఆర్ఎస్ 2 చోట్ల గెలిచింది.

తెలంగాణ మున్సిపాలిటీ ఫలితాల్లో టీఆర్ఎస్‌కు ఊహించని షాక్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts