మూడు రాజధానులపై వెనక్కి తగ్గని జగన్: మంగళవారం వరకు అసెంబ్లీ?

January 23, 2020 at 4:13 pm

మూడు రాజధానులని ఎలా అయిన అమలు చేయాలని జగన్ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ, సి‌ఆర్‌డి‌ఏ రద్దు బిల్లులని మండలి సెలక్ట్ కమిటీకి పంపడంపై సీరియస్‌గా ఉన్న జగన్ ప్రభుత్వం…ఇకపై ఎలా ముందుకెళ్లాలనే సమాలోచనలు చేస్తుంది. పలువురు న్యాయ నిపుణలతో తీవ్రంగా చర్చిస్తుంది. ఈ క్రమంలోనే వెంటనే మూడు రాజధానులని అమలు చేయాలనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలని మంగళవారం వరకు పొడిగించే ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.

ఇక ఈ సమావేశాల్లోనే ఎలాగైనా అసెంబ్లీ ద్వారానే మూడు రాజధానులపై నిర్ణయం తీసుకుని ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. అటు మరోసారి శాసనమండలి సమావేశాలని కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే సెలెక్ట్‌ కమిటీకి రాజధాని వికేంద్రీకరణ బిల్లును పంపాలని మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో 3 నెలలు రాజధానిపై నిర్ణయం ఆలస్యం కావొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలని పొడిగించి ముందుకెళ్లాలని వైసీపీ ప్రభుత్వం వ్యూహాలు రచిస్తుంది.

మూడు రాజధానులపై వెనక్కి తగ్గని జగన్: మంగళవారం వరకు అసెంబ్లీ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts