జగన్ సంచలన నిర్ణయం ..శాసనమండలి రద్దు !

January 23, 2020 at 2:57 pm

శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీకి పంపాలనే నిర్ణయం నేపథ్యంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలిలో టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని మండిపడ్డారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని, సెలక్ట్ కమిటీకి పంపే అవకాశం లేదని చెప్పిన వినలేదని అన్నారు. తొత్తుల్ని తీసుకొచ్చి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారని విమర్శించారు. చంద్రబాబు చెప్పినట్లుగానే షరీఫ్ నాటకాలు ఆడారని వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలోనే మండలి రద్దుపై ఆలోచన చేయాల్సి వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ లాంటి అప్రజాస్వామిక పార్టీ వల్ల మండలి రద్దు చేయాలనే ఆలోచన వస్తోందని అన్నారు. ఇక కొన్ని పచ్చ పత్రికలు తన గురించి తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని మండిపడ్డారు. అయితే బొత్స మండలి రద్దు గురించి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. మండలిలో టీడీపీకి మెజారిటీ ఉన్న నేపథ్యంలో మండలిని రద్దు చేయాలని జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బొత్స చేసిన వ్యాఖ్యలని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. మరి చూడాలి మండలిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.

జగన్ సంచలన నిర్ణయం ..శాసనమండలి రద్దు !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts