మండలిని కొనసాగించాలా? నిర్ణయం తీసుకుందాం… జగన్

January 23, 2020 at 6:26 pm

ఏపీ సీఎం జగన్ శాసనమండలిపై సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ…మండలిని కొనసాగించలా అనే దానిపై చర్చిద్దామని, సోమవారం కూడా అసెంబ్లీ సమావేశపరిచేలా చూడాలని, ఇలాటి మండలిలో ఉండటం అనవసరమని, దీనిపై చర్చ జరగాలని కోరారు. ఇక స్పీకర్ కూడా సోమవారం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ఉంటుందని ప్రకటించారు. ఇంకా జగన్ మాట్లాడుతూ… 29 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లోనే మండలి ఉంది. ఇక దీనికి ఖర్చు అనవసరమని అప్పటిలో చాలామంది మేధావులు చెప్పారు. పెద్దల సభ అంటే మంచి చదువులు కలిగినవారు ఉండాలని, కానీ ఇప్పుడు పరిస్తితి అలా లేదని అన్నారు. అయితే అక్కడ ఉండాల్సిన వారు మన అసెంబ్లీలోనే ఉన్నారని అన్నారు. చాలామంది డాక్టర్లు, ఇంజినీర్లు, రైతులు, టీచర్లు, లాయర్లు, కళాకారులు అసెంబ్లీలో ఉన్నారని చెప్పుకొచ్చారు.

మండలికి సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు పెడుతున్నామని, అసలే పేదరికంలో ఉన్న మండలికి ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అని జగన్ ప్రశ్నించారు. అయితే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన మండలి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వెళితే ఇలాంటి సభలని ఉంచాలా? అని అడిగారు. రూల్స్ కు వ్యతిరేకంగా వెళుతున్న ఇలాటి సభ అక్కర్లేదని మాట్లాడారు. ఇక రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదమే లేదని చెప్పారు. అయితే అధికారన్ని డీ సెంట్రలైజేషన్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని అన్నారు. రాష్ట్రంలో సీఎం ఎక్కడ ఉండైన పరిపాలించే అధికారం ఉందని విస్పష్టంగా చెప్పారు. దీనికి ఏ చట్టం అక్కర్లేదని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా అసెంబ్లీ, హైకోర్టులు పెట్టొచ్చని, ఎక్కడ నుంచైనా చట్టం చేయొచ్చని తెలిపారు.

మండలిని కొనసాగించాలా? నిర్ణయం తీసుకుందాం… జగన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts