మండలి రద్దుపై బాబు వీడియో వేసి ఆటాడుకున్న పేర్ని

January 27, 2020 at 1:47 pm

ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దుపై చర్చ జరుగుతున్న సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ…టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన 40 ఏళ్ల అనుభవం చేతబడి చేయడానికి తప్ప దేనికి పనికి రావడం లేదని అన్నారు. ఇక గతంలో శాసనమండలి రద్దు చేయాలని చంద్రబాబు మాట్లాడిన వీడియోని అసెంబ్లీలో ప్లే చేసి చూపించారు. అప్పుడు చంద్రబాబు మాట్లాడుతూ….శాసనమండలి వల్ల ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందని, మండలిలో ప్రభుత్వం ఇచ్చే ప్రతి బిల్లుని అడ్డుకునే అవకాశం ఉందని కాబట్టి, మండలి రద్దు చేయాలని అప్పటి వైఎస్సార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇక అప్పుడు మండలి రద్దు చేయాలని మాట్లాడిన చంద్రబాబు….ఇప్పుడు మండలి కావాలంటూ యూ టర్న్‌ తీసుకున్నారు. అయిన ప్రపంచంలో చంద్రబాబు తీసుకున్నన్ని యూ టర్న్‌లు ఎవరు తీసుకోలేదని చెప్పారు. అలాగే తెలంగాణ వద్దని మొదట చెప్పి…తర్వాత దానికి అనుకూలంగా లేఖ ఇచ్చారని గుర్తుచేశారు. తర్వాత బీజేపీతో పలుమార్లు పొత్తు పెట్టుకోవడం, పలుమార్లు దూషించడం చేశారని అన్నారు. అదేవిధంగా ప్రత్యేక హోదా మీద కూడా అనేకసార్లు యూ టర్న్ తీసుకున్నారని తెలిపారు. ఎన్నికల ముందు మోడీని తిట్టి..ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

మండలి రద్దుపై బాబు వీడియో వేసి ఆటాడుకున్న పేర్ని
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts