అధికార పార్టీ ఆ అంచనా వేయలేకపోయింది…

January 28, 2020 at 4:21 pm

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్ధతు తెలిపిన విశాఖ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మండలి రద్దుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మండలి రద్దు నిర్ణయం వల్ల వైసీపీకే నష్టమని, కొన్ని రోజులు ఆగితే వారికే మెజారిటీ వచ్చేదని చెప్పారు. అయిన మండలి ఛైర్మన్‌పై టీడీపీ ఒత్తిడి తీసుకురాలేదని, మామూలుగానే టీడీపీకి మెజారిటీ ఉందని, ఆ విషయాన్ని అధికార పార్టీ సరిగా అంచనా వేయలేకపోయిందని అన్నారు. ఇక వైఎస్సార్ ఎంతో ఆలోచన చేసి మండలిని తెచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు.

అయితే వైఎస్ జగన్ దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం సబబు కాదన్నారు. మండలి రద్దు వెంటనే అమల్లోకి వచ్చే పరిస్థితి లేదని, ఎప్పటికి అమల్లోకి వస్తుందో కూడా తెలియదన్నారు. ఇక సెలక్ట్ కమిటీ వ్యవహారం ఎప్పటికీ తేలుతుందో తెలియదని, రాజధాని తరలింపు విషయం అంత సులువు కాదని, కోర్టులు కూడా హెచ్చరిస్తున్నాయని తెలిపారు. అయితే విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని, కాకపోతే ఈ విషయంలో పార్టీ నిర్ణయం పార్టీదే అని చెప్పారు.

అధికార పార్టీ ఆ అంచనా వేయలేకపోయింది…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts