బ్రేకింగ్: మండలి రద్దు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

January 27, 2020 at 6:11 pm

అంతా ఊహించినట్లే జరిగింది. గత కొన్ని రోజులుగా ఉత్కంఠ కలిగిస్తున్న శాసనమండలి రద్దు అంశానికి ఈరోజు ఫుల్ స్టాప్ పడింది. జగన్ ప్రభుత్వం మండలి రద్దు బిల్లుని అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోద ముద్రవేసింది. ఈరోజు ఉదయం సీఎం జగన్ మోహన్ రెడ్డి బిల్లుని ప్రవేశ పెట్టగా, మిగతా వారు దానిపై చర్చిస్తూ…మద్ధతు తెలిపారు. ఇక మండలి రద్దుపై చర్చ అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం బిల్లుపై ఓటింగ్ చేపట్టారు.

ఈ ఓటింగ్‌లో మండలి రద్దుకు అనుకూలంగా 133 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 0 వచ్చాయి. ఇక ఓట్లు 2/3 కంటే ఎక్కువ ఉండటంతో బిల్లు పాస్ అయినట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు 151 కాగా, ఇద్దరు టీడీపీ, ఒక జనసేన ఎమ్మెల్యే మద్ధతు ఉన్నారు. స్పీకర్‌ని పక్కనబెట్టేస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. ఇక ఈ సమావేశానికి ప్రతిపక్ష టీడీపీ హాజరు కాని విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఓటింగ్ కంటే ముందు జగన్ మాట్లాడుతూ… గతంలో ఒక మనిషి కోసం మండలిని రద్దు చేశారని, ఇప్పుడు కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం చేస్తుంటే.. రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. మండలిని కొనసాగిస్తే ఏడాదిలో తమకు మెజార్టీ వస్తుందని తెలిసినా.. ప్రజల కోసం రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. పార్టీ అవసరాల కంటే ప్రజా ప్రయోజనాలే తమకు ముఖ్యమని, మండలిని రద్దు చేస్తున్నందుకు గర్వపడుతున్నాని చెప్పారు.

బ్రేకింగ్: మండలి రద్దు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts