మంత్రులు జగన్‌తో అలా అన్నారా? టీడీపీకి చిక్కులే?

January 24, 2020 at 10:37 am

ఇప్పటివరకు మూడు రాజధానుల చుట్టూ తిరిగిన రాష్ట్ర రాజకీయం…ఇప్పుడు శాసనమండలి చుట్టూ తిరుగుతుంది. అది కూడా మూడు రాజధానుల బిల్లుని అడ్డుకుని..దాన్ని సెలక్ట్ కమిటీకి పంపడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మండలి ప్రజావ్యతిరేక నిర్ణయం తీసుకుందని స్వయంగా సీఎం జగన్ వ్యాఖ్యానించడం ద్వారా మండలిపై చర్చకు దారి తీసింది. అసలు మండలి అంటే పెద్దల సభ అని, వారు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని…కానీ ఇప్పుడు అలా జరగడం లేదని, కాబట్టి ఇలాంటి మండలి ఉండటం అవసరమా? అని జగన్ అందరినీ ఆలోచింపజేసేలా మాట్లాడారు.

మండలి వల్ల రాష్ట్రానికి ఆర్ధిక భారం పెరిగిందని, కాబట్టి ఇది ఉండాలనే దానిపై చర్చ జరగాలని, సోమవారం కూడా అసెంబ్లీ సమావేశం పెట్టి దీనిపై ఒక నిర్ణయం తీసుకుందామని జగన్ చెప్పుకొచ్చారు. అంటే మండలి రద్దుపై సోమవారం చర్చ జరిగి…ఒక నిర్ణయం తీసుకొనున్నారు. అయితే మండలిలో టీడీపీకి మెజారిటీ ఉండటం వల్ల ప్రభుత్వం చేసే బిల్లులకు ఇబ్బందుకు ఎదురవుతున్నాయి. ఇప్పుడు మూడు రాజధానుల బిల్లుకు కూడా అడ్డు పడింది. ఈ క్రమంలోనే మంత్రులు, జగన్ మధ్య దీనిపై ఓ ఆసక్తికర చర్చ జరిగిందని రాజకీయ వర్గాల ద్వారా తెలిసింది.

జగన్ పెట్టిన రూల్ వల్లే మండలిలో తమకు ఇబ్బంది కలిగిందని మంత్రులు భావిస్తున్నారు. పార్టీలోకి వచ్చేవారు పదవులు రాజీనామా చేసే రావాలని చెప్పడం వల్లే టీడీపీలో ఇంకా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారని లేదంటే తుడిచిపెట్టేసే వాళ్ళమని, కాబట్టి ఇప్పటికైనా అవకాశం ఇవ్వాలని తమ తడాఖా ఏంటో చూపిస్తామని మంత్రులు…జగన్‌తో చెప్పినట్లు రాజకీయ విశ్లేషుకులు మాట్లాడుకుంటున్నారు. అందుకనే మూడు రోజులు సమయం ఇచ్చి, మండలి రద్దు నిర్ణయాన్ని సోమవారం వరకు పోస్ట్ పోన్ చేశారని తెలుస్తోంది. అంటే ఈ మూడు రోజుల్లో టీడీపీ ఎమ్మెల్సీలని లాగేసి కార్యక్రమం మంత్రులు చేపట్టే అవకాశముంది. ఇక వారు వచ్చిన దానిబట్టి మండలి రద్దు ఉంటుందా? ఉండడా? అనే విషయం తేలనుంది.

మంత్రులు జగన్‌తో అలా అన్నారా? టీడీపీకి చిక్కులే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts