మంత్రులు తాగొచ్చారు: బ్రీత్ ఎనలైజర్లు పెట్టాలా?

January 23, 2020 at 4:42 pm

బుధవారం శాసనమండలిలో జరిగిన పరిణామాలపై ఏపీ మంత్రి కన్నబాబు తీవ్రంగా స్పందించారు. ఈరోజు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ… చంద్రబాబు మండలి గ్యాలరీలో ఉండి ఛైర్మన్‌ని ప్రభావం చేశారని మండిపడ్డారు. ఛైర్మన్ కూడా రూల్స్ సరిగా లేవు అని చెబుతూనే..తనకున్న విచక్షణాధికారంతో సెలక్ట్ కమిటీకి పంపుతున్నానని చెబుతూ పెద్ద తప్పు చేశారని అన్నారు. ఈ విచక్షణాధికారం ఛైర్మన్‌కు లేదని, దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని చెప్పారు.

ఇక యనమల రామకృష్ణుడు మంత్రులపై విమర్శలు చేయడం తగదని, మంత్రులు తాగొచ్చారని మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని అన్నారు. అలాగే కొందరు టీడీపీ నేతలు టీవీ డిబేట్లలో మాట్లాడుతూ…మంత్రులకు బ్రీత్ ఎనలైజర్లు పెట్టాలని వాగుతున్నారని, అలాంటి వారిపై సభాహాక్కుల నోటీస్ ఇవ్వాలని స్పీకర్‌ని కోరారు. అటు లోకేశ్ కూడా మండలిలో ఫోన్ పట్టుకుని ఫోటోలు తీశారని, ఆయన బుద్ధి ఏంటో అర్ధం కావడం లేదని అన్నారు. ఇక బిల్లులని కొన్ని రోజులు ఆపినంత మాత్రాన చేసేది ఏం లేదని, అయిన బుధవారం ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే కాదని యెల్లో డే అని మండిపడ్డారు.

మంత్రులు తాగొచ్చారు: బ్రీత్ ఎనలైజర్లు పెట్టాలా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts