బావ,బావమరుదులు మధ్య లొల్లి.. షాక్ లో ఫాన్స్..

February 20, 2020 at 3:24 pm

ఇప్పుడు సిని ప‌రిశ్ర‌మ‌లో బిగ్ న్యూస్ వైర‌ల్ అవుతుంది.. ఈ వార్త‌లో నిజ‌మెంతో తెలియ‌దు కానీ.. సోష‌ల్ మీడియాలో ఈ వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో త‌న త‌న‌యుడు ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడ‌న్న విష‌యం ఇప్ప‌టిదాక సాగిన ప్ర‌చారంకు ఇప్పుడు కొత్త‌గా వైర‌ల్ అవుతున్న వార్త‌తో అభిమానులు, సిని ప్రియులు షాక్ తింటున్నారు. ఇది నిజ‌మేనా అని ఆరాలు తీస్తున్నారు.. ఇంత‌కు వైర‌ల్ అవుతున్న ఈ బిగ్ న్యూస్ ఏంట‌నే క‌దా మీ డౌట్‌..

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా శ‌ర‌వేగంగా నిర్మాణం జ‌రుపుకుంటుంది. ఈ సినిమా కోసం చిరంజీవి త‌న మేకోవ‌ర్‌ను పూర్తిగా మార్చుకున్నారు. సైరా సినిమాలో న‌టించిన చిరంజీవికి ఇప్పుడు న‌టిస్తున్న చిత్రానికి భారీగా చిరంజీవి మారారు. అయితే మెగాస్టార్ త‌న యుక్త‌వ‌య‌స్సులో ఎలా ఉండేవాడో అనే ఓ పాత్ర కోసం త‌న త‌న‌యుడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ను ఎంపిక చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ అవ‌కాశాన్ని ఇప్పుడు ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ నుంచి త‌న బావ‌మ‌రిది స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ లాగేసుకున్న‌ట్లు చిత్ర పరిశ్ర‌మ‌లో, సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు ఆర్ ఆర్ ఆర్ సినిమా నుంచి చిరంజీవి సినిమాలో న‌టించేందుకు అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని, అందుకు ఈ పాత్ర‌కు రామ్‌చ‌ర‌ణ్‌కు బ‌దులుగా బ‌న్నీని ఎంపిక చేసిన‌ట్లు.. మామ చిరంజీవితో అల్లుడు బ‌న్నీ క‌లిసి న‌టించే అవ‌కాశం ఈ సినిమాలో ఉంద‌నే ప్రచారం జ‌రుగుతుంది. చిత్ర సీమ‌లో జరుగుతున్న ఈప్ర‌చారం నిజ‌మైతే బాగుండు అని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. మెగాస్టార్ స‌ర‌స‌న త్రిష న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

బావ,బావమరుదులు మధ్య లొల్లి.. షాక్ లో ఫాన్స్..
0 votes, 0.00 avg. rating (0% score)