మెగాస్టార్ తో.. సూప‌ర్‌స్టార్‌…ఏం స్కెచ్ వేశాడు కొర‌టాల‌?

February 21, 2020 at 5:50 pm

కొర‌టాల‌శివ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరింజీవి హీరోగా `ఆచార్య` సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మెగాఫ్యాన్స్‌కి, ఇటు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఫ్యాన్స్‌కి పండ‌గే పండ‌గ‌. అదేంటి అనుకుంటున్నారా…ప్ర‌స్తుతం ఈ సినిమా మీద ఓ టాప్ సీక్రెట్ లీక్ అయింది. అదేంటంటే… ఈ చిత్రంలో మెగాస్టార్‌తో పాటు సూప‌ర్‌స్టార్ కూడా న‌టించ‌బోతున్నార‌ట‌. ఏంటి న‌మ్మ‌స‌ఖ్యంగాలేదా. నిజ‌మండి..దీనికి ఓ పెద్ద కార‌ణమే ఉంది. అదేంటంటే…ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కొన్ని కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని వార్త‌లొచ్చాయి.

కానీ ఇప్పుడు రామ్ చరణ్ కొన్ని కారణాల మూలంగా తప్పుకున్నాడని అందుకే ఆ ప్లేస్ ను రీప్లేస్ చేయ‌డానికి మ‌హేష్ వ‌స్తున్నాడ‌ని ఫిల్మ్ వ‌ర్గాల్లో ఈ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఓసారి ఇద్ద‌రూ ఒకే వేదిక మీద స‌రిలేరు ఫంక్ష‌న్‌లో అద‌ర‌గొట్టారు. ఇప్పుడు స్క్రీన్ మీద ఒకేసారి ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి రెఢీ అవుతున్నారు. ఇక ఎలాగో కొరటాలకు మహేష్ తో మంచి సాన్నిహిత్యం కూడా ఉంది కాబట్టి ఒకవేళ అడిగినా మహేష్ ఒప్పుకుంటారని చెప్పాలి. ఎలాగే ఒకే వేదిక‌మీద ఒక‌సారి పండ‌గ వాతావ‌ర‌ణం సృష్టించారు. ఇక అలాంటిది వీరిద్దరూ ఒకే సినిమాలో కనపడితే..? ఇక ర‌చ్చ రంబోలానే. అందులో ఏమాత్రం ఆలోచించాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

ఇక ఇదిలా ఉంటే… మ‌రి దీన్ని బ‌ట్టి ఈ సినిమా ఇప్పుడు అనుకున్న స‌మ‌యానికి విడుద‌ల‌వుద్దేమో ఎందుకంటే మొన్న‌టి వ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్ ఇందులో న‌టించ‌డం వ‌ల్ల రామ‌చ‌ర‌ణ్ లుక్ విడుద‌ల‌వుద్ద‌ని రాజ‌మౌళి పెట్టిన కండీష‌న్‌కి చిరంజీవి కూడా త‌ప్ప‌క ఓకే అనాల్సొచ్చింది. మ‌రి ఇప్పుడు వీరికి ఇక ఆ టెన్ష‌న్ లేదు కాబ‌ట్టి వీరు అనుకున్న స‌మ‌యానికి ఈ సినిమా బ‌హుశా రిలీజ్ అవుద్దేమో చూడాలి. ఏది ఏమైనా కొర‌టాల క్రియేటివిటీ అదిరిపోయింద‌నే చెప్పాలి. మ‌నోడు వేసిన స్కెచ్ మాములుగా లేదుగా. ఇంత పెద్ద హై కాంబినేష‌న్ అంటే మాములు విష‌యం కాదు.

మెగాస్టార్ తో.. సూప‌ర్‌స్టార్‌…ఏం స్కెచ్ వేశాడు కొర‌టాల‌?
0 votes, 0.00 avg. rating (0% score)