రష్మిక మాయలో పడ్డ జగిత్యాల కలెక్టర్..

February 20, 2020 at 4:56 pm

కన్నడ భామ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. ఈ ఇయర్ సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు ఈ శుక్రవారం భీష్మ సినిమాతో రాబోతుంది. సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ తో పాటుగా తన గ్లామర్ షో కూడా చేస్తుంది రష్మిక. తన లేటెస్ట్ ఫోటో షూట్ షేర్ చేస్తూ నేను నీ వైపు చూస్తే నీకు నవ్వొస్తుంది అంటూ కామెంట్ పెట్టింది.

అది చూసిన జగిత్యాల కలెక్టర్ చించేశావ్ పో రష్మిక అని కామెంట్ చేశాడు. రష్మికని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్టు ఉన్న ఆ కలెక్టర్ ఆమె పెట్టిన ఫోటోలకు కామెంట్ పెట్టడం చర్చాంశంగా మారింది. ఎంత డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా ఆయన సినిమాలు చూడకూడదా.. ఆయనకు ఫ్యాన్స్ ఉండరా చెప్పండి. మరి రష్మిక ఆ ఐఏఎస్ కు రిప్లై ఇస్తుందో లేదో చూడాలి.

రష్మిక మాయలో పడ్డ జగిత్యాల కలెక్టర్..
0 votes, 0.00 avg. rating (0% score)