విజయ్ దేవరకొండని రాంగ్ రూట్ లోకి తీసుకెళ్తుంది ఎవరు..?

February 14, 2020 at 4:55 pm

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు వరల్డ్ ఫేమస్ లవర్ ద్వారా మరో గట్టి దెబ్బే పడినట్టు అనిపిస్తుంది. తన కెరియర్ లో హిట్టు కొట్టాల్సిన టైం లో విజయ్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇలా ఫ్లాపులు చవిచూడాల్సి వస్తుంది. వరల్డ్ ఫేమస్ లవర్ సరిగా తీసుంటే ఎలా ఉండేదో కాని క్రాంతి మాధవ్ మాత్రం తన ప్రతిభ చూపించడంలో విఫలమయ్యాడు. విజయ్ దేవరకొండ పాత్ర వరకు పర్ఫెక్ట్ గా ఉన్నా మిగతా అంతా చాలా దారుణంగా అనిపిస్తుంది.

పర్ఫార్మెన్స్ వైజ్ రాశి, ఐశ్వర్యా రాజేష్ కూడా అదరగొట్టారు. అయితే ఇక మీదట లవ్ స్టోరీస్ తీయనని విజయ్ ఎందుకు చెప్పాడో ఈ సినిమా రిజల్ట్ చూసి అర్ధం చేసుకోవచ్చు. తనతో లవ్ స్టోరీ అని చెప్పి అందరు ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ చేస్తున్నారు. దానికి అర్జున్ రెడ్డి రిఫరెన్స్ గా మారుతుంది. అందుకే విజయ్ ఇక లవ్ స్టోరీస్ చేయకపోతే బెటర్ అనే ఫీలింగ్ ఆడియెన్స్ లోనే వచ్చింది.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్న విజయ్. ఆ సినిమాతో అయినా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. పూరి సినిమా కూడా తేడా కొడితే మాత్రం విజయ్ కెరియర్ రిస్క్ లో పడినట్టే లెక్క. మరి విజయ్ దేవరకొండ కెరియర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

విజయ్ దేవరకొండని రాంగ్ రూట్ లోకి తీసుకెళ్తుంది ఎవరు..?
0 votes, 0.00 avg. rating (0% score)