విద్యార్థినుల లోదుస్తులను విప్పించిన కాలేజీ యాజమాన్యం.. కారణం ఏంటంటే…?

February 14, 2020 at 6:02 pm

చదువు మనిషిలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది. వివేకవంతులను చేస్తుంది. సామాజిక అంశంలపై చైతన్యాన్ని పెంపొందిస్తుంది. అందుకే మహనీయులు విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. విద్యాలయాలను నెలకొల్పారు అనాడు. కానీ అందుకు భిన్నంగా సనాతన అచారాలే ప్రాతిపదికగా ఓ కళాశాల వ్యవహరిస్తుండడం గమనార్హం. ఆడవారి శరీరంలో సహజంగా జరిగే జీవ ప్రక్రియపై ఉన్న లేపిపోని అపోహలను తొలగించాల్సింది ఫొయి తనే పెంచిపోషించడం సిగ్గుచేటు.
అంతటితో ఆగకుండా బహిష్టు వేళ కిచెన్‌లో ప్రవేశిస్తున్నారని, సహ విద్యార్థులను తాకుతున్నారని అనుమానంతో కాలేజిలోని విద్యార్థునుల లోదుస్తులను విప్పించింది. ఈ సంఘటన గుజరాత్ రాష్ర్టం భుజ్ లో వెలుగు చూసింది. దీనిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

గుజరాత్ రాష్ర్టం భుజ్‌లో స్వామి నారాయణ్ ద్విశతాబ్ది మెడికల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్  ఆధ్వర్యంలో శ్రీ సహజనంద్ గర్ల్స్ ఇన్ స్టిట్యూట్ కొనసాగుతున్నది. దాదాపు 1500 మంది విద్యార్థినులు ఆ కళాశాలలో చదువుతున్నారు. వారిలో చాలా మంది మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులే. భారతీయ సాంప్రదాయాలు అనే పునాదులపై ఈ కాలేజీని నెలకొల్పారు. సనాతన ఆచారాలు, నియమాలు, సంప్రదాయ విలువలకే అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇదిలా ఉండగా నెలసరి (పీరియడ్స్) సమయంలో కొందరు విద్యార్థినులు కిచెన్‌తో పాటు క్యాంపస్‌లోని ఆలయంలోకి ప్రవేశిస్తు్న్నారని, సహ విద్యార్థులను సైతం తాకుతున్నారని ఇటీవల కాలేజీ ప్రిన్సిపాల్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అత్యంత దుర్మార్గపు నిర్ణయం తీసుకుంది.

పీరియడ్స్‌లో ఉన్న విద్యార్థులను గుర్తించేందుకు  తరగతి గదిలో ఉన్న 68 మంది విద్యార్థులను బయటకు పిలిపించింది. అందరినీ వాష్ రూమ్‌కి తీసుకెళ్లి, ఒక వరుసలో నిలబెట్టి ఒక్కొక్కరి లో దుస్తులు తొలగించి నెలసరిలో ఉన్నారో లేదో పరిశీలించారు. ఈ క్రమంలో  తాము నెలసరిలో ఉన్నామంటూ ఓ ఇద్దరు విద్యార్థులు ముందే ఒప్పుకోగా వారిపై ఆ ప్రిన్సిపాల్ మండిపడింది. ఇష్టానుసారం దుర్బాషలాడారు. ఆ నోట ఈ నోట పడడడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో  క్రాంతిగురు శ్యామ్‌జీ క్రిష్ణవర్మ కచ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఓ కమిటీని నియమించి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. మరైవైపు కాలేజీ యాజమాన్యం తీరుపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. అమ్మాయిల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థినులు సైతం తమకు కళాశాలలో కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీరియడ్స్ విషయంలో  లెక్చరర్లు, వార్డెన్లు, ప్రిన్సిపాల్ నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించడం గమనార్హం.

విద్యార్థినుల లోదుస్తులను విప్పించిన కాలేజీ యాజమాన్యం.. కారణం ఏంటంటే…?
0 votes, 0.00 avg. rating (0% score)