కమల్ హాసన్ ‘భారతీయుడు-2’ సినిమా సెట్లో ప్రమాదం, ముగ్గురు మృతి

February 20, 2020 at 11:31 am

విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్, కాజల్ అగ‌ర్వాల్‌ ప్రధాన పాత్రలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇండియన్ 2. ఈసినిమాకు ఆది నుంచి క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. సినిమా ఏ మూహూర్తానా ప్రారంభించారో కానీ అడుగ‌డునా అడ్డంకులే వస్తున్నాయి. సినిమా మొదలైన‌ప్ప‌టి నుంచి సినిమాకు క‌ష్టాలు వ‌స్తూనే ఉన్నాయి. వ‌స్తున్న క‌ష్టాల‌ను అదిగ‌మిస్తూనే చిత్ర యూనిట్ సినిమాను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా భార‌తీయుడు 2 సినిమా నిర్మాణ స‌మ‌యంలో భారీ విషాదం చోటు చేసుకుంది.

ఈ సినిమాను త‌మిళంతో పాటుగా తెలుగులో భారతీయుడు 2 గా విడుదల చేయనున్నారు. గతంలో సంచలన విజయం సాధించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా దీన్ని నిర్మిస్తున్నారు. సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగులో అపశృతి చోటుచేసుకుంది. షూటింగ్‌ సమయంలో ఓ భారీ క్రేన్‌ కూలి ముగ్గురు చనిపోయారు. వీరితో పాటుగా ప‌లువురు గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిలో డైరెక్టర్ శంక‌ర్ కూడా ఉన్నారు. ఈ ఘటనపై హీరో కమల్‌హాసన్‌ ట్విట్టర్ లో పోస్టు చేశాడు.

సినిమా ప్ర‌స్తుతం చెన్నై శివార్లలోని పూనమల్లిలో ఈవీపీ ఫిల్మ్ సిటీలో రాత్రి ఈ ఘటన జరిగింది. పదిమంది వరకూ గాయపడ్డారు. సినిమా షూటింగ్ జరుగుతుండగా 150 అడుగుల భారీ క్రేన్ తెగిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ లైట్‌బాయ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్లు మధు (29), కృష్ణ (34) మృతి చెందారని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కమల్ హాసన్ సెట్లోనే ఉన్నారు. సినిమాకు ఆది నుంచి వ‌స్తున్న క‌ష్టాల‌ను ఎదుర్కొంటూనే షూటింగ్‌ను పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద ప్ర‌మాదం జ‌ర‌గ‌డం, ఇందులో ప‌లువురు మృతి చెంద‌డం, డైరెక్ట‌ర్‌తో స‌హా ప‌లువురు గాయ‌ప‌డ‌టం సినిమాకు మ‌రో అడ్డంకిగా మారింది. ఎందుకు ఇలా భార‌తీయుడు 2కే జ‌రుగుతుందో అంతు చిక్క‌డం లేదు. ఇప్పుడు జ‌రిగిన ఈ ప్ర‌మాదంతో సినిమా మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

కమల్ హాసన్ ‘భారతీయుడు-2’ సినిమా సెట్లో ప్రమాదం, ముగ్గురు మృతి
0 votes, 0.00 avg. rating (0% score)