హిట్ డైరక్టర్‌కు హ్యాండ్ ఇచ్చిన హీరో, హీరోయిన్!

February 15, 2020 at 11:14 am

శర్వానంద్, సమంతలు జంటగా ‘జాను’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. తమిళ్ సూపర్ హిట్ ‘96’ రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు అంత పెద్దగా రీచ్ కాలేదు. కాకపోతే నటనా పరంగా సమంత-శర్వానంద్‌లకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ జంట కాంబినేషన్‌లోనే ‘మహాసముద్రం’ తెరకెక్కించాలని ఆర్‌ఎక్స్100 దర్శకుడు అజయ్ భూపతి ఫిక్స్ అయ్యాడు.

మొదట నాగచైతన్య – సమంత జంటగా ఆయన ఈ సినిమాను చేయాలనుకున్నాడు. చైతూ-సమంత ఇద్దరికీ కథ వినిపించడం జరిగిపోయింది. అయితే చైతూకి గల కమిట్మెంట్స్ కారణంగా ఈ ప్రాజెక్టు ఇంకా ఆలస్యమయ్యేలా వుందట. అందువలన శర్వానంద్‌ను అజయ్ భూపతి సంప్రదించడం .. అయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అన్నారు.

కానీ ఇప్పుడు జాను సినిమా అంతగా హిట్ కాకపోవడంతో, సమంత మనసు మార్చుకున్నట్టు చెబుతున్నారు. మళ్లీ అజయ్ భూపతి హీరో హీరోయిన్లను వెతికేపనిలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు.

హిట్ డైరక్టర్‌కు హ్యాండ్ ఇచ్చిన హీరో, హీరోయిన్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts