డ్రంక్ అండ్ డ్రైవ్‌లో త‌ప్ప‌తాగి దొరికేసిన టాప్ లేడీ యాంక‌ర్‌…!

February 17, 2020 at 1:10 pm

ఇటీవల హైదరాబాద్‌లో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఫారిన్ కల్చర్ కి బాగా అలవాటు పడిపోయారు. ఫారిన్ కల్చర్ అనేది హైదరాబాదులో ఇప్పుడు పెద్ద వ్యసనంగా మారిపోయింది. వీకెండ్ వచ్చిందంటే చాలు సామాన్యులే పార్టీల్లో మునిగి తేలుతున్నారు… ఇక సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. వాళ్ళు పబ్బుల్లో… మబ్బుల్లో తాగి ఎంజాయ్ చేయటం అన్నది వాళ్ళకి వ్య‌స‌నంలా మారిపోయింది. ఇటీవల హైదరాబాదులో చేస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎంతో మంది సెలబ్రిటీలు దొరికిపోతున్నారు. సినిమా వాళ్లు… రాజకీయ నాయకులు… ధనవంతుల పిల్లలు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోయిన వార్తలు మనం చూస్తూనే ఉంటున్నాం.

ఇక హైద‌రాబాద్‌లో బడాబాబులకు నిలయమైన జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో పలువురు ప్రముఖులు అడ్డంగా బుక్కవ్వ‌డం నిత్యం కామ‌న్ అయ్యింది. తాజాగా నిన్న రాత్రి బంజారా హిల్స్ లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ చెకప్ లో ఏడుగురు యువతులు ఫుల్లుగా మద్యం తాగి పట్టుబడ్డారు. వీరు అస‌లేం మాత్రం ఒళ్లు తెలియ‌నంత ఫుల్లుగా మందు తాగి ఉన్నార‌ట‌.

ఈ పట్టుబడ్డ ఐదుగురు యువతుల్లో ఓ ప్రముఖ యాంకర్ కూడా ఉన్నట్టు తెలిసింది. ఇక ఆ యాంక‌ర్ చాలా టాప్ యాంక‌ర్‌. బుల్లి తెర‌పై పలు కార్యక్రమాలతో ఆ యాంకర్ కు మంచి క్రేజ్ ఉందని, ఆమెకూడా ఓ రేంజ్ లో తాగి ఉందని సమాచారం. పైగా పోలిసుల వద్ద ఆమె కొంత వీరంగం కూడా చేసింద‌ట‌. ఇటీవ‌లే ఆమె చాలా త‌క్కువ టైంలో పాపుల‌ర్ యాంక‌ర్‌గా గుర్తింపు పొందింది. కొద్ది రోజుల క్రిత‌మే ఆ యాంక‌ర్‌కు పెళ్లి కూడా అయ్యింది.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో త‌ప్ప‌తాగి దొరికేసిన టాప్ లేడీ యాంక‌ర్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts