నాగ చైతన్య ‘ఏయ్ పిల్ల’ మ్యూజికల్ ప్రివ్యూ

February 14, 2020 at 11:33 am

నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇంతకముందే ‘ఏయ్ పిల్ల’ సాంగ్ మ్యూజికల్ ప్రివ్యూ విడుదలైంది. ప్రేమికుల రోజు సందర్భంగా వచ్చిన ఈ ప్రివ్యూలో చైతు, సాయి పల్లవిల మధ్య మంచి రొమాన్స్ నడిచింది. ఇక ఈ ప్రివ్యూ వీడియో చివరిలో సాయి పల్లవి..చైతుకు ముద్దు పెట్టడం, చైతు బాగా సిగ్గు, టెన్షన్ పడటం హైలైట్ అనే చెప్పాలి. సి‌హెచ్ పవన్ అందించిన సంగీతం చాలా బాగుంది.

ఇక ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మొదట్లో నాగచైతన్య, సాయి పల్లవి జంట ఎలా ఉంటుందో అని అంతా అనుకున్నారు. తాజాగా విడుదలైన లుక్స్ లో ఈ జంట బాగా సెట్ అయింది. ఈ సినిమా ‘ఫిదా’సినిమాలా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని అంతా అనుకుంటున్నారు. ‘ఫిదా’లో సాయి పల్లవి తెలంగాణ యాస మాట్లాడితే, ఈ సినిమాలో చైతూ తెలంగాణ యాస మాట్లాడనున్నాడు. నారాయణ దాస్ నారంగ్ .. రామ్ మోహన్ రావ్ నిర్మిస్తున్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేయనున్నారు.

నాగ చైతన్య ‘ఏయ్ పిల్ల’ మ్యూజికల్ ప్రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts