బాలయ్య టార్గెట్ గట్టిగానే ఫిక్స్ చేసుకున్నారట…!

February 21, 2020 at 1:29 pm

జైసింహా తర్వాత బాలయ్యకు సరైన హిట్లు లేని విషయం తెలిసిందే. రెండు పార్టులుగా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్, ఇటీవల వచ్చిన రూలర్ సినిమాలు దారుణ పరాజయం మూటగట్టుకున్నాయి. అయితే ఈ ఫ్లాపులకు బ్రేక్ వేయడానికి, సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన, బోయపాటి శ్రీనుతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 26 నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇక ఈ సినిమాతో బాలయ్య పెద్ద టార్గెట్‌ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు బాలయ్య సినిమాలలో ఒక్క గౌతమీపుత్ర శాతకర్ణి మాత్రమే 50 కోట్ల షేర్ దాటింది. మిగిలిన చిత్రాలన్నీ 50 కోట్లు లోపే కలెక్ట్ చేశాయి. అయితే ఎన్టీఆర్ బయోపిక్‌తో 100 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు గానీ, అది 25 కోట్లు కూడా దాటలేక చేతులెత్తేసింది. దీంతో ఇప్పుడు బోయపాటి సినిమాతో 70 కోట్లు టార్గెట్ పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.

కాకపోతే ఈ చిత్రానికే బడ్జెట్ 70 కోట్లు అవుతుందని అంటున్నారు. కానీ నిర్మాత అంత పెట్టలేనని చేతులెత్తేస్తున్నాడు అంట. రూ.40 కోట్లలోపే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని కండీషన్స్ పెట్టారట. ఇంత తక్కువ బడ్జెట్‌తో అయితే చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు అనుకున్నట్లు రావని, క్వాలిటీ కావలంటే పూర్తి బడ్జెట్ తప్పదని బోయపాటి చెప్పారట. చివరకు కొన్ని కండీషన్స్‌తో నిర్మాత ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఆధ్యాత్మికతతో మొదలైయ్యే బాలయ్య పాత్ర చాల వైవిధ్యంగా ఉండబోతుందట. సినిమాలో యాక్షన్ చాల సహజంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

బాలయ్య టార్గెట్ గట్టిగానే ఫిక్స్ చేసుకున్నారట…!
0 votes, 0.00 avg. rating (0% score)