బాలయ్య బాటలో మంచు మనోజ్

February 18, 2020 at 12:44 pm

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో బాలయ్య అఘోరా పాత్రలో కనిపించనున్నాడని వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాకు అదే పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తుంది. అయితే బాలయ్య మాదిరిగానే మంచు మనోజ్ కూడా అఘోరా పాత్ర చేయడానికి సిద్ధమయ్యాడని తెలిసింది.

మనోజ్ దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాతో వెండితెర మీద కనిపించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. వచ్చే నెల 6వ తేదీన గ్రాండ్ గా ఈ సినిమా ప్రారంభం కానుంది. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకంపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఐదు లాంగ్వేజ్స్‌లో విడుదల కానుందని తెలుస్తోంది.

ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ తెలుస్తోంది. ఈ సినిమాలో మనోజ్ అఘోరగా నటిస్తున్నాడని సమాచారం. శవాలను సైతం పీక్కుతినే పాత్రలో మనోజ్ ఇరగదీయనున్నాడని అంటున్నారు.

బాలయ్య బాటలో మంచు మనోజ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts