బాలకృష్ణ పక్కన వరుణ్ తేజ్ హీరోయిన్…!

February 12, 2020 at 4:18 pm

రూలర్ సినిమా తర్వాత నందమూరి అందగాడు బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రూలర్ సినిమా ఫ్లాప్ కావడం అంతకు ముందు, ఎన్టీఆర్ బయోపిక్ లో రెండో భాగం కూడా ఫ్లాప్ కావడంతో బాలకృష్ణ ఇప్పుడు తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితో సినిమా చెయ్యాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే బోయపాటి తో సినిమాను ఫైనల్ చేసారని టాక్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి రంగం సిద్దమైంది. ఈ నెల 26 నుంచి వారణాసిలో సినిమా షూటింగ్ జరగనుంది. వేసవిలో విడుదలవుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరూ అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. ప్రస్తుతం ఈ సినిమా కోసం సీనియర్ హీరోయిన్ నయనతారని తీసుకునే అవకాశ౦ ఉందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమా కోసం అనుష్క పేరు కూడా వినపడింది.

అయితే ఇప్పుడు మరో హీరోయిన్ పేరు వినపడుతుంది. తెలుగులో కంచే సినిమాతో అరంగేట్రం చేసిన ప్రగ్యా జైస్వాల్ ని హీరోయిన్ గా తీసుకునే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే బోయపాటి ఆమెతో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తుంది. కథ ప్రకారం చూస్తే ఆమె అయితే బాగుంటుందని భావిస్తున్నారట. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరా పాత్రలో నటించే అవకాశం ఉందని టాక్.

బాలకృష్ణ పక్కన వరుణ్ తేజ్ హీరోయిన్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts