‘ భీష్మ ‘ 2 డేస్ క‌లెక్ష‌న్స్‌… బాక్సాఫీస్ కుమ్ముడే కుమ్ముడు..

February 23, 2020 at 12:41 pm

యంగ్ హీరో నితిన్ న‌టించిన లేటెస్ట్ మూవీ భీష్మ‌. ఛ‌లో ఫేం వెంకీ కుడుముల ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ తొలి రోజు తొలి షోకే బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా రెండు రోజుల్లోనే భీష్మ ఏకంగా రు. 10.73 కోట్ల షేర్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వీర‌విహారం చేస్తోంది. పైగా థియేట‌ర్ల‌లో సంక్రాంతి సినిమాల త‌ర్వాత థియేట‌ర్ల‌లో ఏ సినిమా లేక‌పోవ‌డంతో సినిమా ప్రియులు భీష్మ‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక సోలో రిలీజ్‌తో పాటు భీష్మకి అత్యధిక థియేటర్స్ దొరకడం, పాజిటివ్ టాక్ ఇలా అన్నీ కలిసి నితిన్ కి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి. నితిన్ కెరీర్‌లో సూప‌ర్ హిట్ అయిన అ..ఆ సినిమాను మించిన హిట్‌గా భీష్మ నిలుస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. భీష్మ సినిమా మొదటి రోజు ఆంధ్ర – తెలంగాణాలో 6.3 కోట్ల షేర్ సాధించింది. రెండవ రోజు కూడా ఏ మాత్రం జోరు తగ్గకుండా 4.4 కోట్ల షేర్ తో నితిన్ కెరీర్లో బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తోంది.

ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు.23 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేయ‌గా నాలుగైదు రోజుల‌కే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటేసి భారీ లాభాల్లోకి వెళ్లిపోనుంది. ఇక నితిన్ అ..ఆ సినిమా రికార్డులు, వ‌సూళ్ల‌ను సైతం ఈ సినిమా క్రాస్ చేయ‌నుంది.

‘భీష్మ’ ఆంధ్ర – తెలంగాణ రెండు రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:

నైజాం – 4.19 కోట్లు

సీడెడ్ – 1.4 కోట్లు

గుంటూరు – 1.26 కోట్లు

ఉత్తరాంధ్ర – 1.2 కోట్లు

ఈస్ట్‌ – 92 లక్షలు

వెస్ట్‌ – 71 లక్షలు

కృష్ణా – 68 లక్షలు

నెల్లూరు – 37 లక్షలు
————————————————————-
భీష్మ 2 డేస్ ఏపీ + తెలంగాణ షేర్ = 10.73 కోట్లు
————————————————————-

‘ భీష్మ ‘ 2 డేస్ క‌లెక్ష‌న్స్‌… బాక్సాఫీస్ కుమ్ముడే కుమ్ముడు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts