భీష్మ ‘ ప‌బ్లిక్ టాక్‌… సినిమా సూప‌రా… అంత‌కు మించి బ్లాక్ బ‌స్ట‌రా…!

February 21, 2020 at 6:08 pm

యంగ్ హీరో నితిన్ మూడు వరుస పరాజయాలు తర్వాత నితిన్ చేసిన భీష్మ సినిమా ఈ రోజు మ‌హా శివ‌రాత్రి కానుక‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు తొలి షో నుంచే యునానిమ‌స్ హిట్ టాక్ వ‌చ్చేసింది. సినిమా చూసిన ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కుల నుంచి మొద‌లైంది… ఇక్క‌డ తెలుగు గ‌డ్డ‌పై సినిమా చూసిన ప్రేక్ష‌కులు కూడా ఒక్క‌టే మాట చెపుతున్నారు.

నితిన్‌కు అ..ఆ సినిమా త‌ర్వాత ఆ రేంజ్‌లో ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ప‌డిందంటున్నారు. ఇక సినిమాలో నితిన్ మన పక్కింటి కుర్రాడిలా కనిపించాడు. నితిన్ లుక్, మేకింగ్ విషయంలో గత చిత్రాల స్టైల్లోనే కనపడ్డాడు. సినిమా చూసిన వాళ్ల‌లో చాలా మంది నితిన్ – ర‌ష్మిక మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ ట్రాక్‌ను బాగా ఇష్ట‌ప‌డుతున్నారు. అలాగే నితిన్ – వెన్నిల కిషోర్ కామెడీతో పాటు సినిమా అంతా జ‌న‌రేట్ అయిన కామెడీ కూడా పొట్ట చెక్క‌ల‌య్యేలా ఉందంటున్నారు.

ర‌ష్మిక వాట్టే బేబీ పాటలో.. తన నటన ఆకట్టుకుంటుంద‌ని కొంద‌రు ప్ర‌శంసిస్తున్నారు. ఇక డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల గురించి తెలిసిన వాళ్లు ఆయ‌న్ను కూడా ప్ర‌త్యేకంగా ప్ర‌శంసిస్తున్నారు. వెంకీ కుడుముల ఛలో తరహాలో కమర్షియల్ పంథాలో సినిమాను ఆసాంతం ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడ‌ని అంటున్నారు. ఏదేమైనా భీష్మ సినిమాకు అటు సోష‌ల్ మీడియా పోర్ట‌ల్స్‌లో కూడా రేటింగులు పేలిపోతున్నాయి. ఎవ‌రిని అడిగినా 3, 3.25, 3.5 రేటింగులు ఇస్తున్నారు.

భీష్మ ‘ ప‌బ్లిక్ టాక్‌… సినిమా సూప‌రా… అంత‌కు మించి బ్లాక్ బ‌స్ట‌రా…!
0 votes, 0.00 avg. rating (0% score)