‘ భీష్మ ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ … నితిన్ రేంజ్ ఇది…!

February 22, 2020 at 11:55 am

యంగ్ హీరో నితిన్ – క్రేజీ బ్యూటీ రష్మిక జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘భీష్మ’. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ మూవీ శివరాత్రి కానుకగా ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఛ‌ల్ మోహ‌న్‌రంగ‌, శ్రీనివాస క‌ళ్యాణం, లై లాంటి మూడు ప్లాప్ సినిమాల త‌ర్వాత నితిన్ న‌టించిన ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో మంచి అంచ‌నాలు వ‌చ్చాయి.

మ‌రో వైపు నితిన్ పెళ్లి త‌న ఫియాన్సీ షాలినీ రెడ్డితో కుద‌ర‌డంతో పాటు ఎంగేజ్‌మెంట్ కూడా జ‌ర‌గ‌డంతో ఈ సినిమాపై నితిన్ కూడా భారీగానే ఆశ‌లు పెట్టుకున్నాడు. భీష్మ త‌న కెరీర్‌కు ట‌ర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంద‌ని అనుకున్నాడు. అంద‌రి అంచ‌నాల‌కు అనుగుణంగానే భీష్మ స‌క్సెస్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే భీష్మ సినిమాకు తొలి రోజు తొలి ఆట‌కే హిట్ టాక్ వ‌చ్చింది.

దీంతో ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు రాబట్టి వార్తల్లో నిలిచింది. ఏపీ మరియు తెలంగాణాలలో కలిపి 6.4 కోట్ల షేర్ రాబట్టింది. నితిన్ నటించిన ‘ఆ అ..’మూవీ తరువాత సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా భీష్మ నిలిచింది. ఇక సోలో రిలీజ్ కావ‌డంతో పాటు సంక్రాంతికి వ‌చ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ములో సినిమాల త‌ర్వాత థియేట‌ర్ల‌లో స‌రైన సినిమమాలు లేక‌పోవ‌డంతో భీష్మ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల పండ‌గ చేసుకోవ‌డం ఖాయం.

‘ భీష్మ ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ … నితిన్ రేంజ్ ఇది…!
0 votes, 0.00 avg. rating (0% score)