” భీష్మ‌ ” రివ్యూ & రేటింగ్

February 21, 2020 at 4:38 pm

టైటిల్‌: భీష్మ‌
బ్యాన‌ర్‌: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
నటీన‌టులు: నితిన్‌, ర‌ష్మిక మంద‌న్న‌, జిస్సు సేన్ గుప్తా, అనంత్ నాగ్‌, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు
సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
సంగీతం: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
నిర్మాత‌: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, ద‌ర్శక‌త్వం: వెంకీ కుడుముల‌
రిలీజ్ డేట్‌: 21 ఫిబ్ర‌వ‌రి, 2020

ఆ.. ఆ సినిమా త‌ర్వాత నితిన్ మార్కెట్ ఒక్క‌సారిగా స్కై రేంజ్‌కు వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత లై, ఛ‌ల్ మోహ‌న్‌రంగా, శ్రీనివాస క‌ళ్యాణం లాంటి మూడు ప్లాప్‌లు రావ‌డంతో నితిన్ మార్కెట్ స్టైబిలైజ్ కాలేదు. తాజాగా నితిన్ పెళ్లి షాలినీరెడ్డితో ఫిక్స్ అవ్వ‌డం… ఇటు భీష్మ రిలీజ్‌కు ముందే పాజిటివ్ బ‌జ్ తెచ్చుకోవ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌హా శివ‌రాత్రి కానుక‌గా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ :
సినిమా కథ విషయానికొచ్చేసరికి ఆర్గానిక్ పద్దతిలో వ్యవసాయం చేయాలనుకునే వారికి, భీష్మ ఆర్గానిక్ సంస్థ ద్వారా కొత్త పద్ధతులని రైతులకు చెబుతూ ఉంటుంది. ఆ కంపెనీ సీఈఓ అనంత్ నాగ్ రైతులకు రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో పని చేస్తుంటారు. ఇక దానికి పోటీగా మరో కార్పొరేట్ కంపెనీ హెడ్ అయిన రాఘవన్(జిష్షు) అడ్డుపడుతుంటాడు. క్రిమినల్ మైండ్‌తో, డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దారుణాలకు పాల్పడతాడు. ఈ క్రమంలోనే భీష్మ సంస్థ బాధ్యతలు నితిన్ తీసుకుంటాడు. ఆ తర్వాత జిష్ణుకు నితిన్ ఎలా చెక్ పెడతాడు. మధ్యలో రష్మిక లవ్ ట్రాక్ ఎలా నడుస్తుందనేది స్టోరీ.

TJ విశ్లేష‌ణ :
ఇక ఈ సినిమా ఫస్టాఫ్ కాస్త కామెడీగానే సాగింది. అలాగే హీరో ఎలివేషన్ సీన్స్ బాగానే పెట్టారు. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఏదో అలా సాగినట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ప్రతీ ఆర్టిస్టుకు నటించే స్కోప్ దొరికింది. ఇంటర్వెల్‌లో చోటు చేసుకునే చిన్న ట్విస్ట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అటు సెకండాఫ్ విషయానికి వస్తే దర్శకుడు వెంకీ…కామెడీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. కామెడీ సీన్స్ ఒకదాన్ని మించి మరొకటి ఉంటాయి. అలాగే సెకండాఫ్‌లో యాక్షన్ ఎపిసోడ్, నితిన్, కేజీయఫ్ ఫేమ్ నటుడు అనంత్ నాగ్‌ల మధ్య వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

అటు నటీనటుల విషయానికొస్తే ’అఆ’ తర్వాత నితిన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ పాత్ర ఇదే అని చెప్పొచ్చు. ఓ వైపు ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తూనే, మరోవైపు హీరోయిజం కూడా ఓ రేంజ్‌లో చూపిస్తాడు. అలాగే నితిన్ ఎమోషన్స్, రొమాన్స్ ఇలా అన్ని యాంగిల్స్‌లోను అదరగొట్టేసాడు. అటు రష్మిక కూడా మంచి నటన కనబరిచింది. విలన్ పాత్రలో చేసిన జిష్షు గుప్త మరోసారి అదరగొట్టాడనే చెప్పొచ్చు.

ఇక దర్శకుడు వెంకీ కుడుముల సినిమాని ఆద్యంతం కామెడీ పంచడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాని ఎక్కడ బోరు లేకుండా తీశాడు. సినిమా ప్ర‌ధానంగా ప్రీ ఇంటర్వల్ దగ్గర వచ్చే 30 నిమిషాలు భీభత్సంగా నవ్విస్తుంది. అలాగే సెకండాఫ్ లోని మొదటి 40 నిమిషాలు ఆడియన్స్ మస్త్ ఎంజాయ్ చేస్తారు. కామెడీ బాగానే ఉన్న ఫస్టాఫ్ కాస్త స్లోగా సాగడం, తెలిసిపోయే కథనం ఉండటం మైనస్. అటు మహతి అందించిన పాటలు కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ చాలా బాగున్నాయి.

ఫైన‌ల్‌గా..
ఛలో తో మొదటి హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల ద్వితీయ విఘ్నం విజ‌య‌వంతంగా దాటేశాడు. చాలా రోజుల త‌ర్వాత నితిన్ కోరుకుంటోన్న సూప‌ర్ హిట్ కూడా అందించాడు. సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్రేక్ష‌కులు క‌డుపుబ్బా న‌వ్వుకుంటూ బ‌య‌ట‌కు వ‌స్తారు. ఫ్యామిలీతో స‌హా వెళ్లి ఎంజాయ్ చేసే సినిమా.

ఫైన‌ల్ పంచ్ : భీష్మ‌కు ఛ‌లో

భీష్మ TJ రేటింగ్ : 3.25 / 5

” భీష్మ‌ ” రివ్యూ & రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)