బీజేపీకి ఢిల్లీ ఓట‌మి కాదు… భారీ కుదుపు!

February 12, 2020 at 11:12 am

దేశ రాజ‌ధాని న‌గ‌రం, అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత రాష్ట్రం ఢిల్లీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అతి పెద్ద జాతీ య పార్టీ బీజేపీ ఘోరంగా తుడిచి పెట్టుకుపోయింది. అనేక ఆశ‌లు పెట్టుకున్న బీజేపీకి భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. అయితే, దీనిని ఎలా చూడాలి? ఆ పార్టీ ఢిల్లీ సీఎం అభ్య‌ర్థి(పైకి ప్ర‌క‌టించ‌క‌పోయినా.. ఆయ‌నే అనేది అంద‌రికీ తెలిసిన స‌త్యం) మ‌నీష్ తివారీ మాట‌ల్లో చెప్పాలంటే.. గ‌తంలో మూడు సీట్ల నుంచి 8 సీట్ల‌కు పుంజుకుంద‌ని బీజేపీ చంక‌లు గుద్దుకోవాలి! కానీ, ఇది వాస్త‌వం కాదు. నేడు ఢిల్లీలో వ‌చ్చిన రిజ‌ల్ట్‌.. జాతీయ స్థాయిలో చెప్పాలంటే… బీజేపీకి భారీ కుదుపుగానే చెప్పాలి.

ఎందుకంటే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను బీజేపీలోని అగ్ర‌నాయ‌క‌త్వం స‌హా ప్ర‌ధాని మోడీ, అమిత్ షాలు అత్యంత కీల‌కంగా తీసుకున్నారు. మొత్తం 70 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ నాయ‌కులు పోటా పోటీగా ప‌ర్య‌టిం చి ప్ర‌చారం చేశారు. ఇక‌, ప‌క్క‌నే ఉన్న యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ త‌న స‌త్తా చాటుకునేందుకు ప్ర‌య‌త్నించారు. రాష్ట్రంలోనే తిష్ట‌వేసి మ‌రీ ప్ర‌చారం చేశారు. ప్ర‌ధాని మోడీ నేరుగా 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేశారు. అమిత్ షా ఇంటిటికీ వెళ్లి మ‌రీ ప్ర‌చారం చేశారు. ఇక‌, బీజేపీకి చెందిన ప్ర‌తి ఎంపీ కూడా ఇక్క‌డ ప్ర‌చారం చేశారు. మ‌రీ ముఖ్యంగా హిందూ సాధుసంతులు కూడా ప్ర‌చారం నిర్వ‌హించారు.

దాదాపు రెండు ద‌శాబ్దాలుగా ఇక్క‌డ పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీ ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా స‌త్తా చాటా ల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలో తాజాగా తెచ్చిన సీఏఏ, ఎన్నార్సీ బిల్లులు స‌హా జేఎన్‌యూలో జ‌రిగి న దాడిని కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నించింది. ముఖ్యంగా ఎన్నిక‌ల‌కు కేవ‌లం నాలుగంటే నాలుగు రోజుల ముందు పార్ల‌మెంటులో రాష్ట్ర‌ప‌తికి ధ‌న్య‌వాదాలు చెప్పే తీర్మానంపై మాట్లాడిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. అయోద్య‌లో రామాల‌యం నిర్మాణానికి సంబంధించిన క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు.

త‌ద్వారా.. హిందూ వ‌ర్గాన్ని బీజేపీవైపు మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేశారు. ఇక‌, జేఎన్‌యూ దాడి ఘ‌ట‌న‌లో లోక ల్ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేయాల‌ని కూడా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. అయితే, ఈ ఎత్తులు ఏవీ కూడా పార‌లేదు. ఢిల్లీలో కేవ‌లం 3 స్థానాల నుంచి 8 స్తానాల‌కు బీజేపీ ఎగ‌బాకినా… దీని నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. రాష్ట్రాలంటే అస్స‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం, త‌మ పంతం త‌మ‌దే అన్న‌ట్టుగా ముందుకు సాగ‌డం, స‌మాజాన్ని మ‌త‌ప‌రంగా చీల్చాల‌నే కుట్ర‌కు పాల్ప‌డుతున్నార‌నే విప‌క్షాల వాద‌న బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం వంటి ప‌రిణామాలతో బీజేపీ హ‌వా మ‌స‌క‌బారుతోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి దీని నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాల్సిన అవ‌స‌రం బీజేపీకి ఎంతైనా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

బీజేపీకి ఢిల్లీ ఓట‌మి కాదు… భారీ కుదుపు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts