ప‌వ‌న్ కంటే బీజేపీకి జ‌గ‌నే బెట‌రా? మారుతున్న స‌మీక‌ర‌ణ‌లు

February 14, 2020 at 6:58 pm

నిన్న మొన్న‌నే ఆ రెండు పార్టీల మ‌ధ్య సంధి కుదిరింది. అంత‌కు ముందు ప‌ర‌స్ప‌రం చేసుకున్న విమ ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌కు ఫుల్ స్టాప్ పెట్టి మ‌రీ నాయ‌కులు చేతులు క‌లుపుకొన్నారు. ఇక‌పై ఎక్క‌డికి వెళ్లి నా.. క‌లిసివెళ్లాల‌ని, ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. క‌లిసే పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌జ‌ల కుకూడా ఇదే విష‌యాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. త్వ‌ర‌లోనే ఏపీలో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్త‌ల ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేసి విజ‌యం సాధించాల‌ని పునాదులు బ‌ల‌ప‌రుచుకోవాల‌ని కూడా నిర్ణ‌యించుకున్నారు. వారే. కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న బీజేపీ, రాష్ట్రంలో దూకుడుగా ఉన్న జ‌న‌సేన‌లు.

ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తుపొడుపు పొడిచింది. అయితే, ఇప్పుడు ఇవి రెండు దూర‌మ‌య్యే ప‌రిస్థితి కూ డా క‌నిపించ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. బీజేపీ వైఖ‌రిపై ప‌వ‌న్ గుస్సా గా ఉన్నారు. అదేస‌మ‌యంలో ప‌వ‌న్ రాజ‌కీయాల‌కు దూరంగా ఉండి.. సినిమాలు చేసుకుంటుం డ‌డంతో త‌మ‌కు ఆయ‌నతో ఏదో ఉప‌యోగం ఉంటుంద‌ని భావించాం.. కానీ, ఆయ‌న వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌ని బీజేపీ భావిస్తోంద‌ట‌. ముఖ్యంగా పై స్థాయిలో బీజేపీ నాయకులు.. ప‌వ‌న్ పొలిటిక‌ల్ గ్రాఫ్‌ను అంచ‌నావేసిన త‌ర్వాత‌.. ఆయ‌న ఓట్లు, రేటింగులు తెలుసుకున్నాక‌.. ఆయ‌న వ‌ల్ల ప్ర‌యోజ‌నం పెద్ద‌గా లేద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అదేస‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏపీలో ఎదిగేందుకు ఉన్న ప‌రిస్తితుల‌ను గ‌మ‌నిస్తే.. ఒక్క జ‌గ‌న్ పార్టీ త‌ప్ప మ‌రొక‌టి బీజేపీకి క‌నిపించ‌డం లేద‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోనే పెద్ద చ‌ర్చ సాగుతోంది. ప్ర‌జా బ‌లం , ఓట్ల షేరింగ్‌, విశ్వ‌స‌నీయ‌త‌, డైన‌మిక్ డెసిష‌న్స్ ఇలా అనేక విష‌యాల్లో ఎలా చూసినా.. ప‌వ‌న్ కంటే జ‌గ‌నే బెట‌ర‌ని ఢిల్లీ నేత‌లు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో నేరుగా కాక‌పోయినా.. తెర‌చాటుగా అయినా జ‌గ‌న్‌తో సంబంధ బాంధ‌వ్యాలు నెర‌ప‌డం మంచిద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంద‌ని అంటున్నార‌ట బీజేపీ పెద్ద‌లు.

ఈ ప‌రిణామంతో ప‌వ‌న్‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లే అవ‌కాశం ఉంద‌ని కూడా చెబుతున్నారు. ప‌వ‌న్ కంటే జ‌గ‌నే బెట‌ర‌ని బీజేపీ అనుకోవ‌డం వ‌ల్ల ప‌వ‌న్ అన్ని విధాలా న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి ఈయ‌న ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో చూడాలి.

ప‌వ‌న్ కంటే బీజేపీకి జ‌గ‌నే బెట‌రా? మారుతున్న స‌మీక‌ర‌ణ‌లు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts