విశాఖలో ఉద్రిక్తత..రోడ్డుపై బైఠాయించిన బాబు..

February 27, 2020 at 3:37 pm

చంద్రబాబు విశాఖ పర్యటన ఉద్రిక్తతగా మారింది. ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఆయన్ని ఎటు కదలనివ్వకుండా విశాఖ ఎయిర్ పోర్టు రోడ్డులో ఆపేశారు. అయితే పోలీసులు ఎంత ప్రయత్నించిన వైసీపీ శ్రేణులు వెనక్కి తగ్గకపోవడంతో పొద్దున నుంచి బాబు అక్కడే ఉండిపోయారు.

ఈ క్రమంలోనే ఎంత సమయం అవుతున్న ఎలాంటి మార్పు లేకపోవడంతో, చంద్రబాబు కాన్వాయ్ దిగేసి రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. దీంతో పరిస్తితులు చేజారిపోతాయనే నేపథ్యంలో చంద్రబాబుని మళ్ళీ తిరిగి వెనక్కి పంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన చుట్టూ ఉన్న టీడీపీ కార్యకర్తలని, నేతలనీ పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి పంపించేస్తున్నారు. అంతా అనుకూలంగా మారాక పోలీసులు చంద్రబాబుని తిరిగి ఎయిర్ పోర్టులో వదిలే అవకాశముంది.

విశాఖలో ఉద్రిక్తత..రోడ్డుపై బైఠాయించిన బాబు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts